English | Telugu

ప్రపంచం మర్చిపోయినా నేను మర్చిపోను.. థాంక్యూ శివయ్య


బుల్లితెర మీద అష్షు రెడ్డి ఒక హాట్ బాంబ్. ఆర్జీవి బ్యూటీ..జూనియర్ సమంత..పవన్ కళ్యాణ్ ఫ్యాన్..ఇలా ఆమె గురించి చాలా చెప్పుకోవచ్చు. ఐతే ఇదంతా జీవితంలో ఒక భాగం. అష్షు లైఫ్ లో మరో భాగాన్ని చూస్తే ఆమె ఒక ఫైటర్..జీవితాన్ని గెలిచిన అమ్మాయి. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుని మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాక ఆ జీవితం ఎప్పటికీ అలా గుర్తు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి తన బ్రెయిన్ సర్జరీ విషయం కూడా అంతే. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ప్రపంచం మర్చిపోవచ్చు..కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ జూన్ 4 వస్తే నాకు బ్రెయిన్ సర్జరీ జరిగి ఏడాది పూర్తయ్యింది.

థ్యాంక్యూ అనే ఒకే ఒక్క పదమే నా మైండ్ లో వస్తుంది" అంటూ థాంక్యూ శివయ్య, రిబోర్న్, బ్రెయిన్ సర్జరీ అంటూ హ్యాష్ టాగ్స్ పెట్టింది. అలాగే ఒక ఫైటర్ అని రాసి ఉన్న ఒక చాకోలెట్ కేక్ పిక్ ని పోస్ట్ చేసింది అష్షు రెడ్డి. ఆ పోస్ట్ కి హీరో అరవింద్ కృష్ణ మెసేజ్ చేసాడు. "చాలా గర్వంగా ఉంది. నీ కం బ్యాక్ అనేది చాల ఇన్స్పైరింగ్ గా మనసుల్ని కదిలించేదిగా ఉంది. నీకంతా మంచే జరగాలి" అని విష్ చేసాడు. ఇక అష్షు మూవీస్ విషయానికి వస్తే ఛల్ మోహన రంగా, ఏ మాష్టర్ పీస్ వంటి మూవీస్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 3 , బిగ్ బాస్ నాన్ స్టాప్ షోస్ లో పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అష్షు .

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.