English | Telugu

సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వబోతున్న శోభా శెట్టి...కారణం అదేనా?

శోభా శెట్టి సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వైరల్ గా మారింది. ఐతే ఎందుకు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుందో మాత్రం రీజన్స్ చెప్పలేదు. ఇక నెటిజన్స్ ఐతే ఆమె బ్రేక్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. "ఎం జరిగిందో తెలీదు కానీ చాలా స్ట్రాంగ్ గా అయ్యి తిరిగి రండి...ఏమయ్యింది అక్క. ఇదేమన్నా ప్రాంక్ మెసేజా...హ్యాపీ జర్నీ" అంటూ మెసేజెస్ చేస్తున్నారు.

ఐతే ఇంతకు పర్సనల్ రీజన్స్ కారణంగా వెళ్ళిపోతోందా లేదంటే ఇంకా ఇంకేమైనా కన్నడ నుంచి బెటర్ ఆఫర్ లు వచ్చాయా లేదంటే బిగ్ స్క్రీన్ మీద ట్రై చేయడానికి బ్రేక్ తీసుకుంటోందా లేదా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని పెళ్లి చేసుకుని తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇండస్ట్రీలో ఉంటుంది కానీ లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు అంతేనా ? అంటూ కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. శోభా శెట్టికి కార్తీక దీపం సీరియల్ మంచి బ్రేక్ ఇచ్చింది. కానీ తర్వాత అలాంటి సీరియల్స్ ఇంకా ఏమీ రాలేదు. ఈమధ్య కొన్ని షోస్ లో కనిపిస్తోంది..అలాగే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. కానీ ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ వచ్చినట్టు ఏమీ కనిపించడం లేదు. కనడ బిగ్ బాస్ కి వెళ్లి మధ్యలోనే వెళ్ళొచ్చేసింది. కార్తీక దీపం సీరియల్ సెకండ్ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది కానీ ఇంకా పెళ్లిని పెండింగ్ లో పెట్టింది. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చాక కాబోయే వాడితో కలిసి కొత్త ఇల్లు కొనుక్కుంది. మరి ఏమయ్యిందో ఇంత సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పడం ఏంటో తెలీడం అంటూ ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.