English | Telugu

ఇసుక తిన్నెలపై హాట్‌ హాట్‌గా అషు రెడ్డి!


ఒకవైపు ఎడారిలో ఇసుక తిన్నెలు వేడిపుట్టిస్తుంటే.. మరోవైపు బోల్డ్ పిక్స్ తో కుర్రాళ్ళకి సెగ పుట్టిస్తుంది అషురెడ్డి. విదేశాలలో ఉంటూ ఎంజాయ్ చేస్తున్న అషరురెడ్డి.. రోజు రోజుకి తన గ్లామర్ ని పెంచేస్తుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తనదే అగ్రస్థానమని చెప్పాలి. పలు వెబ్ సిరీస్ , టీవీ షోస్ లలో ఆకట్టుకుంటున్న అషురెడ్డి.. బిగ్ స్క్రీన్ మీద ఛాన్స్ కోసం హాట్ అండ్ బోల్ట్ ఫోటోషూట్ లతో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది.

అషు రెడ్డి.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది. అంతేకాకుండా మరోసారి ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ కూడా అప్పట్లో వైరల్ అయింది.

అషు రెడ్డి, కమెడియన్ పటాస్ హరితో సన్నిహితంగా ఉంటుంది. దాంతో ఇద్దరు లవ్ లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అషు రెడ్డి బిబిజోడి షో కోసం మెహబూబ్ తో కలిసి జోడి గా వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో వెళ్ళిపోయింది. అషు ప్రస్తుతం ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. అక్కడ కొత్త కొత్త డ్రెస్ లు వేసుకొని ఫోటోషూట్స్ తో సెగపుట్టిస్తుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఇసుక తిన్నెలమీద తన బ్యాక్ చూపిస్తూ తీసుకున్న ఫోటోలని షేర్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.