English | Telugu

ఫ్రెండ్ బుగ్గ మీద అష్షు ముద్దుల వర్షం

అష్షు ఎప్పుడు ఏది చేసినా అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది..బాత్ టబ్బులో కనిపించినా, బ్లాక్ డ్రెస్ లో అలరించిన, తోటలో పూలను పలకరించినా, దూడపిల్లకు గడ్డి తినిపించిన అది అష్షుకే సొంతం. మరి అలాంటి అష్షు ఇప్పుడు ఏం చేసింది అంటే తన ఫ్రెండ్ కలిసి ముద్దులు పెట్టుకున్నారు. అందం మాత్రమే కాదు చిలిపి పనులు కూడా చేస్తూ ఉంటుంది అష్షు. తన ఫ్రెండ్ హరియా రెడ్డితో కలిసి జ్యూస్ తాగుతూ కన్ను కొడుతూ ఆ ఫొటోస్, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అష్షు..

తన ఫ్రెండ్ ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. " ఇలాంటి ఫ్రెండ్ ఉండడం చాలా రేర్. ఆమె నా వజ్రం. నేను తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి" అంది చెప్పింది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్స్ పెడుతున్నారు. అష్షు ఎక్కువగా బ్లాక్ డ్రెస్ నే ప్రిఫర్ చేస్తుందన్న విషయం తన వీడియోస్, ఫొటోస్ చూస్తే అర్థమైపోతుంది. ఇక ఆ బ్లాక్ డ్రెస్ లో ఫ్రెండ్స్ ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు. అష్షు కొన్ని మూవీస్ లో నటిస్తోంది. వాటి షూటింగ్ కోసం రీసెంట్ గా పులివెందుల వగైరా ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చింది. ఏ మాస్టర్ పీస్, పద్మవ్యూహం చక్రధారికే తెలుసు వంటి మూవీస్ లో కనిపించి ఆడియన్స్ ని అలరించబోతోంది. షూటింగ్స్ తో అలిసిపోయిన వర్మ బ్యూటీ హైదరాబాద్ కి చేరుకుని ఫ్రెండ్ తో మస్త్ ఎంజాయ్ చేస్తోంది.

బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా నెమ్మదినెమ్మదిగా సిల్వర్ స్క్రీన్ మీద బిజీ ఐపోతున్నారు. అలా బిజీ అవుతున్నవారిలో అష్షు రెడ్డి కూడా ఒకటి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.