English | Telugu

శ్రీహన్ గుర్తొచ్చినప్పుడల్లా తన షర్ట్ మీద కిస్ చేసేదాన్ని

బుల్లితెర లవ్ జోడి శ్రీహాన్- సిరి హనుమంతు గురించి అందరికీ తెలుసు. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో సిరి హనుమంతు -యూట్యూబర్ షణ్ముఖ్ మధ్య క్లోజ్ నెస్ వల్ల అప్పట్లో నెటిజన్స్ సిరిని ఫుల్ గా ట్రోల్ చేసి పడేసారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీహాన్-సిరి మధ్య కొన్ని రోజులు మాటలు లేవు కానీ తర్వాత వాళ్లిద్దరూ కలిసిపోయి అన్ని ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం షన్ను - దీప్తి మధ్య అప్పుడు మొదలైన దూరం ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

ఐతే ఇప్పుడు ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా స్టార్ మాలో "లవ్ టుడే" అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి శ్రీహాన్ తన ప్రేయసి సిరి హనుమంతుతో కలసి వచ్చాడు. ‘బిగ్ బాస్’లో జరిగిన ఘటనలను తలచుకుని బాధ పడింది సిరి. శ్రీహన్ ఎప్పుడూ యూనిక్ గా ఉంటాడు కాబట్టి సిరి గోల్డ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది. శ్రీహాన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా మిస్ ఐనట్లు, తాను గుర్తొచ్చినప్పుడల్లా తన దగ్గర ఉన్న శ్రీహాన్ షర్ట్ పైన కిస్ చేస్తూ ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. జీవితంలో చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారని, కానీ స్టేజి మీద వాటిని ఎవరూ ఒప్పుకోరు అని తనకు తెలియకుండానే ఏదైనా తప్పు చేశానేమో అని కన్నీరు పెట్టుకొనేసరికి సిరిని శ్రీహాన్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.