English | Telugu

దూడపిల్లకు గడ్డి తినిపించిన అష్షు..సోనియాగాంధీలా ఉన్నావన్న నెటిజన్!

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి అంటే అందరికీ తెలుసు. హీరోయిన్స్ కంటే కూడా సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..సోషల్ మీడియా హీరోయిన్ గా చెప్పుకోవచ్చు. కాంట్రావర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓవర్ నైట్ లో ఫేమస్ ఐపోయింది. యూట్యూబ్ స్టార్ ఒక వెలుగు వెలిగింది. అలా ‘బిగ్ బాస్ " హౌస్ లోకి ఎంట్రీ దక్కించుకుంది.

ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీలో నటించింది. ఇప్పుడు మరో కొత్త మూవీ షూటింగ్ కోసం ఆమె పులివెందులకు వెళ్ళింది అష్షు. అక్కడి పల్లె అందాల్ని ఆస్వాదించింది. పువ్వుల్ని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రెడ్ కలర్ శారీలో ఒక దూడ పిల్లకు గడ్డి తినిపిస్తూ దిగిన ఫోటో కూడా పోస్ట్ చేసింది...ఇక ఈ ఫోటోకి నెటిజన్స్ నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.."శారీలో చాలా బాగున్నారు, ఇప్పుడు పల్లెటూరి అమ్మాయిలా ఉన్నారు..ఇంకా మీరు యానిమల్ ప్రమోషన్ చేస్తున్నారేమో " అంటే మరో నెటిజన్ ఇంకొంచెం ముందుకు వెళ్లి "మీరు సోనియాగాంధీ రోల్ కి సూటవుతారు అలాంటి అవకాశం వస్తే వదులుకోవద్దు" అంటూ సలహా ఇచ్చారు.

ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఆర్జీవీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అషు రెడ్డిని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాలును ముద్దు పెట్టుకున్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.