English | Telugu

బుల్లితెర షోస్ లో విచ్చలవిడిగా ముద్దూముచ్చట్లు!

బుల్లితెర మీద ఈమధ్య ముద్దులు హద్దులు దాటుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ తో పాటు స్మాల్ స్క్రీన్ కి సెన్సార్ బోర్డు అవసరం ఏమో అనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ముద్దులు పెట్టుకోవడం, డాన్సులు ఇలా ఎన్నో బుల్లితెర షోస్ లో ఈమధ్య విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు హాయిగా ఇంటిల్లిపాది చూసేలా ఉండేవి ఈ షోస్ కానీ అప్పుడప్పుడు హద్దులు కూడా దాటుతున్నాయి. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే ఆ విషయం తెలుస్తోంది. ఈవారం కాన్సెప్ట్ కింద లేడీస్ హాస్టల్ వర్సెస్ బాయ్స్ హాస్టల్ మధ్య పోటీలు పెట్టారు. ఇందులో లేడీస్ హాస్టల్ వార్డెన్ గా భావన, జెంట్స్ హాస్టల్ వార్డెన్ గా ఆటో రాంప్రసాద్ వచ్చారు.

ఇక ఎప్పటిలాగే కమెడియన్స్ అంతా హాస్టల్ లో స్టూడెంట్స్ లా లైన్ లో నిలబడి అటెండెన్స్ వేయించుకున్నట్టు కమెడియన్స్ వాళ్ళ టీం లీడర్స్ తో పంచులు వేయించుకుని వెళ్తుంటారు. అలా ఈ షోకి జెస్సి వచ్చాడు. ఇంకా సీరియల్ యాక్టర్ కీర్తిభట్ మిత్రుడు ఐన ఆది వచ్చి " ఏమిటి జెస్సి ఈమధ్య డల్ గా ఉంటున్నావ్..డిప్రెషన్ లోకి వెళ్లిపోయావ్" అని అడిగేసరికి " ఏం లేదురా..ఈ మధ్య నాకు ఒక అమ్మాయి మెసేజ్ చెయ్యట్లేదు అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో అంకిత వీడియో ప్లే చేశారు..ఏం అంకిత నాకు నువ్వు ఎందుకు మెసేజ్ చెయ్యట్లేదు..రిప్లై ఇవ్వట్లేదు" అని అందరి ముందు అడిగేశాడు. "ఎందుకు రిప్లై ఇస్తాననుకుంటున్నావ్..ఎవ్వరితో బడితే వాళ్ళతో ఫోటోలు దిగి స్టేటస్ లో పెట్టుకుంటున్నావ్" అనేసరికి "అందరూ ఒక ఎత్తు ..నువ్వు నాకు సంథింగ్ స్పెషల్ కదా..ఆ విషయం నీకు తెలుసు కదా" అని జెస్సి ఆన్సర్ ఇచ్చేసరికి అంకిత నవ్వేసింది.

"స్పెషల్ అని చెప్తే సరిపోదు అలా చూసుకోవాలి" అని అంకిత అనేసరికి ఒకసారి ఇటురావే అని పిలిచి "సంథింగ్ స్పెషల్ చూస్తావా..అటు చూడు అని అంకిత బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు. అంతలో రోహిణి లైన్ లోకి వచ్చేసి "ముద్దు పెట్టినప్పుడు కూల్ గా ఎందుకు వున్నావ్ కొట్టు వెళ్లి" అంది సీరియస్ గా.."అంటే జెస్సి ముద్దుపెట్టడం వలన నాకు ప్రాబ్లమ్ లేదు" అని చెప్పేసింది అంకిత. దాంతో రోహిణి హర్ట్ అయ్యి వెళ్ళిపోయింది జెస్సి ఈల వేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. "మెసేజ్ కి రిప్లై ఇవ్వడం ప్రాబ్లమ్ కానీ ఇలా ముద్దు పెడితే ప్రాబ్లమ్ లేదా" అని రష్మీ అడిగేసరికి "లవ్ అనేది లోపల ఉంది కానీ ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు" అని చెప్పింది. ఏదేమైనా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇలాంటి షోస్ చూసేటప్పుడు ఈ విధమైన ముద్దు ముచ్చట్లు ఉంటే ఎవరు ఎలా చూడగలుగుతారు చెప్పండి అంటున్నారు నెటిజన్స్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.