English | Telugu
హరితో కలిసి అష్షు డాన్స్...పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్న!
Updated : Feb 15, 2023
అష్షు రెడ్డి ఎలా కావాలంటే అలా జీవించే అమ్మాయి. నచ్చింది చేస్తుండే కానీ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోడు. ఒక పక్కన బోల్డ్ గా కనిపిస్తూనే నాలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్స్ప్రెస్ హరితో కలిసి అషు హెల్పింగ్ హ్యాండ్స్ అనే హోమ్ కి వెళ్లారు. అక్కడే కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. "మన దగ్గర అపరిమితమైన ప్రేమ ఉన్నప్పుడు ఎవరికైతే ప్రేమ దొరకదో వాళ్ళతో పంచుకోవాలి...ఈ ఏడాది ఇలా నేను నా వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకున్నాను" అని పిల్లలతో కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. పిల్లలతో కలిసి "చింపిరి జుట్టుదాన్ని" సాంగ్ కి హరి, అష్షు కలిసి డాన్స్ చేశారు. "ఇలాంటి మంచి మంచి పనులు చెయ్యి...ఎవరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టరు...అందరూ మెచ్చుకుంటారు. గుడ్ వర్క్, గ్రేట్ వర్క్" అని కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటే కొంతమంది మాత్రం " ఆర్మీ జవాన్లు వీరమరణం చెందిన రోజున పిల్లలతో కలిసి ఇలాంటి డాన్సులు చేయడం అవసరమా" అంటున్నారు. అష్షు ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది.