English | Telugu
రాజీ, అను ఒకరే అని ఆర్య కనిపెట్టగలడా?
Updated : Jul 28, 2022
కొంత కాలంగా జీ తెలుగులో ప్రసారమవుతోన్న పాపులర్ సీరియల్స్‌లో ప్రేమ ఎంత మధురం ఒకటి. మహిళా వీక్షకులు ఈ సీరియల్ కోసం రోజూ ఎదురుచూస్తుంటారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా చిత్ర విచిత్రమైన మలుపులు, ట్విస్ట్ లతో సాగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రేమ ఎంత మధురం. విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఆర్యవర్ధన్ తిరిగి కోలుకుంటాడు. అయితే అనురాధ ఆచూకీ మాత్రం లభించదు. దీంతో అను కోసం ఆర్య అన్వేషణ మొదలు పెడతాడు.
చివరికి ఓ చోట అనుని పోలివున్న రాజీ కనిపించడంతో తనే అను అని ఆర్య మనసు ఆరాటపడటం మొదలుపెడుతుంది. అయితే జెండే మాత్రం తను అను కాదని వాదిస్తూ వుంటాడు. కానీ ఆర్య మాత్రం "తను అనునే అని నా నమ్మకం" అని బలంగా వాదిస్తూ వుంటాడు. తన గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. తనకు కళ్లు లేని ఓ అక్క, తమ్ముడు వున్నారని తెలుస్తుంది. అయినా సరే తను అనునే అని నిరూపించడం కోసం ఆర్య ప్రయత్నిస్తుంటాడు.
ఇదే సమయంలో ఆర్య, జెండేలని కలిసిన రాజీ "నాటకాలు వేయడానికి వచ్చిన వారని తెలిసింది. డబ్బులిస్తే నేనూ నాటకం వేస్తాను "అంటుంది. దీంతో ఇదే సరైన అవకాశమని, అనుకు గతం గుర్తు చేయొచ్చని ఆర్య భావించి సీతారాముల నాటకం వేయడానికి రెడీ అవుతారు. రాజీ.. సీత, ఆర్య.. రాముడు, జెండే.. హనుమంతుడుగా గెటప్ లు వేసుకోవాలి. జెండే గెటప్ తో రెడీ అయిపోతాడు. అను కూడా రెడీ అయి వస్తుంది. ఇంతలో ఆర్య.. రాముడి గెటప్ లో రావడంతో రాజీ లో మార్పు కనిపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.