Read more!

English | Telugu

స్టేజి మీద ఏడ్చేసిన అర్జున్ కళ్యాణ్..ఓదార్చిన శ్రీసత్య


బీబీ జోడి ఇరగదీసే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ షోలో ప్రతీ వారం ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ షోలో అర్జున్ కళ్యాణ్-వాసంతి పెయిర్ కి మంచి పేరు వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోగ్రాం స్టార్టింగ్ లో మెహబూబ్, శ్రీసత్యకు పెళ్లి చేస్తున్నాం అని అనౌన్స్ చేసాడు అవినాష్. "మీరేదో ప్లాన్ తో వచ్చారు ...పెళ్లి చేయాలి అంటే పెళ్లి పెద్దలు ఉండాలి కదా " అని హోస్ట్ శ్రీముఖి అనేసరికి "మగపెళ్లి వారి తరపున తరుణ్ మాస్టర్, ఆడపెళ్ళి వారి తరపున రాధమ్మ, అందరి తరపున సదాగారు వచ్చారు" అని చెప్పాడు. తరువాత  కౌశల్, అభినయశ్రీ మాస్ స్టెప్పులు వేసే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. ఆ పెర్ఫార్మెన్స్ చూసిన సదా ముందు తనకు  నచ్చలేదని  తరువాత  చాలా బాగా నచ్చినట్లు చెప్పింది. 

ఆ తరువాత మెహబూబ్, శ్రీసత్య  నాటు నాటు సాంగ్ కి   స్టెప్స్ ఇరగదీసేసారు. ఐతే వీళ్ళ డాన్స్ స్టెప్స్ సరిగా సింక్ అవ్వలేదని సత్య ఆడపిల్లలా చేయలేదు ఆడపులిలా చేసింది అని చెప్పాడు.  ఆ తరువాత భానుశ్రీ, రవి బాగా చేశారు,  ఆర్జే సూర్య - ఫైమా జోడి డాన్స్ ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక అవినాష్ ఒళ్లో కూర్చుని అరియానా ఫ్లోర్ స్టెప్ వేశారు. రొమాంటిక్ గా పెర్ఫార్మ్ చేసే  అఖిల్, తేజస్వి ఈ వారం దేశభక్తి పాటకి డాన్స్ చేసి అలరించారు. ఎప్పటిలాగే అర్జున్ కళ్యాణ్-వాసంతి జోడి వెరైటీగా క్యూట్ గా డాన్స్ చేశారు. అప్పుడు ఏమయ్యిందో తెలీదు కానీ  అర్జున్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అతని బిగ్ బాస్ లవర్ శ్రీసత్య.. స్టేజ్ మీదికి వచ్చి మరీ ఓదార్చింది. వేళ్ళ జోడి పెర్ఫార్మెన్స్ కి  రవి-భానుశ్రీ ఒక మార్క్ మాత్రమే ఇచ్చారు. దీంతో రాధకి కాలిపోయింది. "స్ట్రాటజీ అనుకుంటే.. మేం మీకు పదికి పది ఇచ్చేవాళ్లం కాదు కదా" అని వాసంతి చాలా నైస్ గా చెప్పింది. దీంతో రాధా.. ‘బాధపడొద్దు..  మీకు టైమొస్తుంది" అని  రియాక్ట్ అయ్యింది రాధ.