English | Telugu
ఆన్ స్క్రీన్ మీద కొత్త జంటగా పండు- ఆరియానా
Updated : Sep 27, 2023
స్మాల్ స్క్రీన్ మీద జబర్దస్త్ షో ద్వారా ఆన్ స్క్రీన్ జోడీస్ గా చాలా మంది మంచి పేరుతో, అవకాశాలు తెచ్చుకున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ లో రష్మీ- సుధీర్ జోడి ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరూ వేరు వేరు కానీ ఆన్ స్క్రీన్ లో వీళ్ళ కెమిస్ట్రీ రచ్చ రంబోలానే..తర్వాత రాకేష్-జోర్దార్ సుజాత జోడి ఉంటుంది..ఐతే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని కపుల్ ఇపోయారు. ఆ తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడి..ఈ జోడి ఇంకా సింగల్ గానే ఉంటోంది. ఇలాంటి జోడీస్ ప్రస్తుతానికి ఫేడ్ అవుట్ ఐపోతున్న టైంలో ఆన్ స్క్రీన్ మీద కొత్త జంట పుట్టుకొచ్చింది.
తెలిసిన ముఖాలు జోడీగా వచ్చి అలరించాయి. వాళ్ళే ఒకప్పుడు ఢీ డాన్స్ లో కిర్రాక్ డాన్సస్ తో ఎంటర్టైన్ చేసిన పండు, రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన అరియనా. పండు అనగానే ఢీ జోడిలో "పలాస" మూవీ లో “నక్కిలీసు గొలుసు” పాటకి లేడీ గెటప్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి గుర్తొస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో "ఖుషి కపుల్ కాన్సెప్ట్" కి ఈ జోడీ ఎంట్రీ ఇచ్చేసరికి యాంకర్ రష్మీ షాకయ్యింది. "ఇదెప్పటి నుంచి" అని రష్మీ అడిగేసరికి "ఆరియానాని ఎవరు ఇష్టపడరు చెప్పండి" అన్నాడు పండు...ఇక ఆరియానా ఇక్కడ ఒక హార్ట్ టచింగ్ డైలాగ్ వేసేసింది "పండు చెప్పకుండా వచ్చావ్ చెప్పకుండా వెళ్లిపోవు కదా" అనేసరికి పండు ఆరియానని గాల్లోకి ఎగరేసి మరీ డ్యూయెట్ స్టెప్స్ వేసి అందరికీ షాకిచ్చాడు. ఇక ఇంద్రజ మాత్రం చాలా మెస్మోరైజింగ్ లుక్స్ తో అలా ఆ కొత్త జంటను చూస్తూ కూర్చుంది. ప్రస్తుతం పండు కొన్ని మూవీస్ కి డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.