Read more!

English | Telugu

ఎమోషనల్ అయిన అప్పు.. కావ్యకి సపోర్ట్ గా రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -234 లో.. ఎలుక తన చీరలు నాశనం చేసిందని కనకం తిడుతుంటుంది. అది విని రుద్రాణి భరించలేక.. ఆపేయ్ తిట్లు అని ఇంకా రెచ్చిపోయి తిడుతుంది కనకం. ఇక ఆ తిట్లు భరించలేక రుద్రాణి వెళ్ళిపోతుంది. కాసేపటికి స్వప్న తిన్న తర్వాత ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటుంది. అప్పుడే ట్యాబ్లెటా? నాకు వద్దని అంటుంది. మీకోసం నేను ఇలాగే ట్యాబ్లెట్ వేసుకున్నానని అంటుంది. ఇక కావ్యను జ్యూస్ తీసుకురా అని  స్వప్న అంటుంది.  ఇప్పుడెంత పనిచేస్తే అంత బాగా ప్రసవం అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంటే వొల్లు కూడా కదపలేవు. కడుపు ఉంటే కదా అమ్మ ప్రసవం అయ్యేది " అని కావ్య అంటుంది. ఏయ్ ఏంటే అలా అన్నావని కనకం‌ అంటుంది. అంటే నేను కేర్ లెస్ గా ఉన్నాను కదా అమ్మ ‌అందుకే తొమ్మిది నెలలు బిడ్డని మోస్తానో లేదోనని అలా కావ్య అందని స్వప్న కవర్ చేస్తుంది. "నీలాగా నేను అవలీలగా అబద్ధాలు చెప్పలేను కదా అక్క" అని కావ్య తన మనసులో అనుకుంటుంది.

మరొకవైపు అప్పుని తీసుకొని కళ్యాణ్, అనామిక కలిసి ఫోటోషూట్ కోసం ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ  అనామిక, కళ్యాణ్ లు క్లోజ్ గా ఉంటారు. వారిని ఫోటోలు తీయమని అప్పుతో కళ్యాణ్ చెప్పగా.. తన గుండె పగిలినంత పని అవుతుంది. కన్నీళ్ళతో వాళ్ళ ఫోటోలని తీస్తుంది అప్పు. దుగ్గిరాల కుటుంబంలో ఉదయం లేచేసరికి కిచెన్ లో పనిమనిషి శాంత వచ్చి పని చేస్తుంటుంది. కిచెన్ లో శాంతని చూసిన కావ్య షాక్ అవుతూ.. తనని అత్తమ్మ చూస్తే ఎంత గొడవ అవుతుందోనని అనుకొని కంగారుపడుతుంది కావ్య. అప్పుడే వచ్చిన అపర్ణ కిచెన్ లో ఉన్న శాంతని చూసి ఆశ్చర్యపోతుంది. కావ్య అని గట్టిగా పిలిచేసరికి ఏదైనా గొడవేమోనని ఇంట్లోవాళ్ళంతా వస్తారు‌. ఏమైందని కావ్య అడుగగా.. శాంతని ఎవరు పిలిచారని అపర్ణ అడుగుతుంది. ఇదే టైమ్ అని రుద్రాణి మధ్యలో దూరి అపర్ణకి కోపం వచ్చేలా నెగెటివ్ గా మాట్లాడుతుంది. రాజ్ వచ్చి నేనే శాంతని తీసుకొచ్చానని అంటాడు.

అందరు షాక్ అవుతారు. రుద్రాణి మధ్యలో కలుగజేసుకొని మీ అమ్మకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు శాంతని తీసుకొచ్చావని రాజ్ ని రుద్రాణి అడుగుతుంది. "ఇంట్లో అందరికి కాఫీ, టీ, గ్రీన్ టీ , టిఫిన్ అంటూ పొద్దున్నుండి మొత్తం పని కావ్యనే చేస్తుంది. ‌తాతయ్యకి ఏ టైమ్ కు ఏం మందులు ఇవ్వాలని కావ్యకి మాత్రమే తెలుసు, అవి ఒక్కోసారి లేట్ అవుతున్నాయి. అందుకే తనకి సాయంగా ఉంటుందని , అన్నీ తెలిసిన శాంతని తీసుకొచ్చాను" అని రాజ్ అంటాడు. మరి మీ అమ్మకి ఒక మాట చెప్పాలి కదా అని రుద్రాణి అడుగుతుంది. పొద్దున్నే అయిదు గంటలకి లేచి అందరికి అన్ని సమకూరుస్తూ, పనులు చేసి తన గదికెళ్ళి పడుకునేసరికి రాత్రి పదకొండు దాటుతుందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.