English | Telugu

బాబా భాస్క‌ర్‌ని ఉతికేసిన‌ యానీ మాస్ట‌ర్‌!

ఈ ఆదివారం స్టార్ ‌మా వినోదాల విందుతో వీక్ష‌కుల్ని అల‌రించ‌బోతోంది. న‌వ్వుల వ‌ర్షం కురిపిస్తూ ఆద్యంతం ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంది. సుమ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'స్టార్ట్ మ్యూజిక్‌'. ఇటీవ‌లే సుమ‌తో పునః ప్రారంభం అయిన ఈ షో ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారం అవుతోంది.

రెండు టీమ్‌ల‌తో సుమ చేసే కామెడీ వీక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఈ వారం ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్స్ బాబా భాస్క‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, యానీ మాస్ట‌ర్ ఈ షోలో పాల్గొంటున్నారు. వీరితో పాటు భానుశ్రీ కూడా పాల్గొని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. బాబా భాస్క‌ర్ తో పాటు మ‌రో ఇద్ద‌రు లేడీస్ ఓ టీమ్‌గా ఈ షోలో పాల్గొంటే, ర‌ఘు మాస్ట‌ర్‌, భాను శ్రీ‌, యానీ మాస్ట‌ర్ ఓ టీమ్‌గా పాల్గొన్నారు.

ఇందులో యానీ మాస్ట‌ర్‌పై బాబా పంచ్‌లు వేయ‌డంతో యానీ మాస్ట‌ర్‌, భానుశ్రీ క‌లిసి బాబా భాస్క‌ర్‌ని ఉతికి ఆరేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. మ‌ధ్య‌లో సుమ ఎంట్రీ ఇచ్చి మాస్ట‌ర్ గ‌డ్డంని చూపిస్తూ "మాస్ట‌ర్‌ నేను మ‌ళ్లీ మ‌ర్చి పోతాను.. వెళ్లేట‌ప్పుడు మాత్రం గిన్నెలు తోముకోవ‌డానికి కొంచెం పీచు కావాలి.. ఇచ్చేసి వెళ్లండి." అంటూ పంచ్ వేయ‌డంతో అంతా న‌వ్వుల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.