Read more!

English | Telugu

బిచ్చగాడిలా అనిల్ జీల.. ట్రెండింగ్ లో గంగవ్వ!

అనిల్ జీల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పేరు. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన ఈ 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు తియ్యడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి.

గంగవ్వ బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు ఆమెకి ధైర్యం చెప్తూ బిగ్ బాస్ లో కొనసాగమని చెప్తూ వచ్చాడు అనిల్ జీల‌. గంగవ్వ మాట తీరుకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లో ఎంట్రీ తో స్టార్ హీరో, హీరోయిన్ లను కలిసే అవకాశం గంగవ్వ దక్కించుకుంది. గంగవ్వ  బిగ్ బాస్ లో ఉండగా నాగార్జున ఆమెకి సొంత ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి.. తనకి సొంత ఇల్లు కూడా కట్టించాడు.  ప్రస్తుతం గంగవ్వ కామెడీ షోస్ లో అప్పుడప్పుడు కనిపించి నవ్విస్తుంది. తాజాగా స్టార్ హీరో రానా దగ్గబాటికి కళ్లు దావత్ అంటూ వీడియోని షేర్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని నవ్వించింది గంగవ్వ. 

ప్రస్తుతం అనిల్ జీల, గంగవ్వ కలిసి ఒక వీడియోని తమ 'మై విలేజ్ షో' ఛానెల్ లో అప్లోడ్ చేశారు‌. అయితే ఆ వీడియో లో కమెడియన్ బాబు మోహన్ పోషించిన పాత్రలా బిచ్చగాడు గెటప్ వేసుకున్నాడు అనిల్ జీల. తను అచ్చం బాబు మోహన్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని కామెడీ పండించాడు. దానికి తోడు గంగవ్వ కామెడీ పర్ఫెక్ట్ గా కుదిరింది. దీంతో ఈ వీడియో అత్యంత వీక్షకాధరణ పొందుతుంది. కాగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.