English | Telugu
ఆ ఒక్క మాట చచ్చిపోతున్న ప్రాణాన్ని బ్రతికిస్తుంది!
Updated : Dec 27, 2023
ప్రతీ సంవత్సరం ముగింపులో అందరికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. కొందరు స్నేహితులతో కలిసి ట్రిప్ లకి, మరికొందరు ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతుంటారు. అయితే కొంతమంది తాగుబోతులు మాత్రం మందుకోసం లైసెన్స్ ఉన్న వైన్స్ ముందు న్యూసెన్స్ చేయకుండా క్యూలో ఉంటారు. ప్రతీ పండగకి, ఏదైన మంచి జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక కారణంతో మందు తాగుతూ మత్తులో ఉండే కొందరికి మందే విందు.. మందే కనువిందు.. మందే సర్వస్వం అన్నట్టు జీవిస్తుంటారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసిన ముందుబాబుల కోసం రీల్స్, షాట్స్, వీడియోలు బయటకు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మై విలేజ్ షో అనిల్ చేసిన ఓ వీడియో చేరింది. గత రెండు రోజుల నుండి ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిల్ స్నేహితుడు రాజు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో ఉంటాడు. ఇక అనిల్ పరుగెత్తుకుంటూ వెళ్లేసరికి డాక్టర్స్ ఇక బ్రతకడు అని చెప్తారు. అంతలోనే అనిల్ అతని స్నేహితుడి దగ్గరికి వెళ్లి చెవిలో ఒకటి చెప్తాడు.. వెంటనే అనిల్ స్నేహితుడు లేచి కూర్చుంటాడు. ఇంతకి అనిల్ ఏం చెప్పాడు. ఎందుకు లేచాడతనంటే.. 31st కి ధావత్ కి మందు రెడీ అయింది. నువ్వు వచ్చేయ్ తొందరా అని చెవిలో చెప్పాడు అంతే.. వెంటనే అతను లేచి కూర్చుంటాడు. మందు అంటే ఇష్టం కాదు ప్రాణం అంటూ మందుబాబుల కోసం తీసిన ఈ ఫన్నీ వీడియో నెటిజన్లకి నవ్వు తెప్పిస్తుంది.
అనిల్ జీల హలో వరల్డ్ తో చాలా మందికి పరిచయం అయిన ఒక యూట్యూబర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. అసలేం జరుగుతుంది ఈ నగరానికి.. ఈ యువతకేం జరుగుతుంది. ఎటుపోతుంది ఈ నవతరం పోకడ. ఒకవైపు రీల్స్, మరోవైపు పబ్ లు.. అలవాట్లు మారుతున్నాయి. ఆచారాలు మారుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తాగుబోతుల కోసం అనిల్ జీల చేసిన ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.