English | Telugu

సుమ వార్నింగ్ మెసేజ్...జాగ్రత్తగా లేకపోతె అంతే


సోషల్ మీడియా ఊపు పెరిగాక బుల్లితెర స్టార్స్ ని సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్లకు ఎన్ని ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎం ఉన్నాయి వాటి ఖరీదు ఎంత ఉండొచ్చు లాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఆ ఫేక్ న్యూస్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నవ్వుకుని వదిలేస్తారు కొందరు డిబేట్స్ పెడతారు కొంతమంది సరదా వీడియోస్ చేసి ఫుల్ ఛిల్ల్ అవుతుంటారు యాంకర్ సుమలా. ఇప్పుడు చెప్తోంది ఆమె గురించే. ఆమె కూడా ఆ ఫేక్ న్యూస్ బారిన పడింది. కానీ లైట్ తీసుకుంది. ఐతే ఈ న్యూస్ ఎదో బాగుందే అనుకుందో ఏమో సరదాగా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. కేరళలో రూ.278 కోట్లతో స్టార్ యాంకర్ సుమ ఒక లగ్జరీ ఇల్లు కట్టుకున్నట్లుగ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక వాయిస్ ఓవర్ కూడా వినిపిస్తూ ఉంటుంది.

ఇక సుమ ఇంట్లో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, 10 మంది బాడీ గార్డులు ఉన్నారని వాయిస్ ఓవర్ లో వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియోపై సుమ రియాక్ట్ అయ్యింది. "ఎవర్రా మీరంతా .. నేనెప్పుడు కట్టానురా ఇంత ఇల్లు. నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టించలేదు. ఫేక్. ఏమనుకుంటున్నావమ్మా అసలు రూ.278 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా..? నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ? 500 సీసీ టీవీ కెమెరాలా ? ఉదాహరణకు ఒక హౌస్ లో 5 రూమ్ లు ఉంటే ఒక్కో రూమ్ లో 5 కెమెరాలు పెట్టినా 25 కెమెరాలు ఉంటాయి . ఇన్ని కెమెరాలు ఎక్కడ పెడతారండి ? అదేమైనా బిగ్ బాస్ హౌస్ నా?’ ‘ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ? ఇలాంటి ఫేక్ వీడియోస్ లో ముఖ్యంగా నేను కనిపించకుండా నా ఫొటోస్ ను కోలాడ్ చేసి.. ఎక్కడో థాయ్ ల్యాండ్ లోనో, గోవాలోనో ఉన్న ఇళ్లను వాయిస్ ఓవర్ తో వచ్చే వీడియోలన్నీ ఫేక్. మేము సెలబ్రిటీస్.. మా అంతట మేమే వచ్చి మాట్లాడితే తప్ప నమ్మకండి. అసలే ఏఐ టెక్నలాజి కూడా వచ్చింది. మా లిప్స్ కూడా జాగ్రత్తగా గమనించండి. నిజంగా మేమే మాట్లాడుతున్నామా , లేదా అని నిర్దారించుకోండి" అంటూ ఒక వార్నింగ్ అలెర్ట్ ఇచ్చింది సుమ.