English | Telugu
బుల్లితెర మీద కొత్త జోడి... సుధీర్ - రష్మీకి పోటీగా శ్రీముఖి- బాలు...
Updated : Jan 18, 2025
బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ లవర్స్ ఎక్కువైపోయారు. ఆన్ స్క్రీన్ లవబుల్ జోడీస్ లో సుధీర్ - రష్మీ జోడి ఉన్నంత క్యూట్ గా ఎవరు ఉండరు. ఐతే ఇప్పుడు బుల్లితెర మీద ఆ జోడిని బీటౌట్ చేయడానికి కొత్త జోడి పుట్టుకొచ్చింది. వాళ్ళే హోస్ట్ శ్రీముఖి - బాలు. ఇక ఈ జోడి లాస్ట్ వీక్ షో నుంచి సంక్రాంతి షోలో ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కూడా తెగ అల్లరి చేస్తూ కనిపించారు. శ్రీముఖికి బాలు అంటే పిచ్చ లైకింగ్ అన్న విషయం తెలిసిపోతోంది. భర్త లాగా ఫీలవుతూ అతని మీద పడుతూ హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ స్వీట్స్ తినిపిస్తూ డాన్స్ లు వేసేస్తోంది. ఇక ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీముఖి బాలుతో ఆడిన సరసాలు భలే క్యూట్ గా అనిపించాయి. ఇక శ్రీముఖి "మా ఆయనకు స్వీట్ తినిపిస్తాను" అంటూ లడ్డూ తినిపించింది. బుగ్గ గిల్లింది. ఇక జ్యోతక్క వచ్చి "ఎం ఇష్టమా శ్రీముఖి అంటే" అని అడిగింది.
"శ్రీముఖి అంటే అందరికీ ఇష్టం" అన్నాడు. "ఆ ఇష్టం కాదు ..పెళ్లి చేసుకుంటుందట నిన్ను" అన్నది. దానికి బాలు సిగ్గుపడిపోయాడు. "సిగ్గుపడ్డాడంటే నేనంటే బాలుకి ఇష్టమే" అని నవ్వేసింది శ్రీముఖి. ఇక మొదటి సారి శ్రీముఖి - బాలు కలిసి మనీ రూమ్ లోకి వెళ్లి డబ్బులు పెట్టె తెచ్చారు. ఇన్నేళ్ల ఈ షోలో ఇంతవరకు హోస్ట్ వెళ్ళింది లేదు. కానీ ఇప్పుడు శ్రీముఖి వెళ్ళింది. ఇక లోపలి వెళ్లి కొంటె మాటలు మాట్లాడింది. "బాలు ఫస్ట్ టైం ఇద్దరం ఒక రూమ్ లోకి వచ్చాము. కాసేపు కెమెరా ఆపేస్తే బాగుంటుంది. " అంటూ బాలుకి చాటుగా నిలబడి ముద్దిస్తున్నట్టు ఫోజ్ పెట్టేసరికి బయట ఉన్నవాళ్ళంతా గట్టిగా అరిచారు. తర్వాత మనీ బాక్స్ తీసుకెళ్ళాక హరి చూసి అసలు మీరిద్దరూ కపూల్సేనా అసలు ఇద్దరూ..శ్రీముఖిని దగ్గరకు లాక్కో బాలు...ఒక ముద్దు పెట్టు" అంటూ యాంకర్ ఓంకార్ మాట్లాడే స్టైల్ లో ఇమిటేట్ చేసేసరికి శ్రీముఖి షాకైపోయింది.