English | Telugu

ఇంట్లోవి వద్దట.. ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే ముద్దట.. కూతురి మీద సుమ ఫైర్!


ఇంట్లో ఉండే కూతుళ్ళకు.. అమ్మలు ఎన్ని వెరైటీ వంటకాలు చేసి పెట్టినా తనివి తీరదు. "ఇవేనా ఇంకేం లేవా?" అని అడుగుతూనే ఉంటారు. అమ్మలు కూడా ఏం తక్కువ తినలేదు. అడిగితే గరిటెలుపట్టుకుని జాడించే వాళ్ళు కూడా ఉన్నారు.డైలీ లైఫ్ లో ప్రతీ ఇంట్లో జరిగే ఈ విషయాలను సుమ డబుల్ రోల్ లో ఒక చిన్న రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 'అమ్మ v/s అమ్ము' పేరుతో "ఎవ్రీడే స్టోరీ ఆఫ్ మథర్స్ ఇన్ ఎవ్రీ హౌస్" అని కాప్షన్ పెట్టింది. అమ్ము డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలన్నీ మూతలు తీసి చూసి... "ఇంకేం లేవా?" అని అడిగింది.

"ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా.. సాంబార్, పాపడ్, పికిల్, దొండకాయ రోటి పచ్చడి, బెండకాయ ఫ్రై చాలా ఉన్నాయి కదా, ఇంకా నీకేం కావాలి?" అని అడిగింది తల్లి సుమ. "అంతేనా!" అని మళ్ళీ అమ్ము ముఖం చిరాగ్గా పెట్టి అడిగేసరికి గరిటె చూపించి, "ఇంకేం కావాలే.. పోనీ దోశ, పల్లీ చట్నీ, ఇడ్లీ, కొబ్బరి చట్నీ చేయనా.. పోనీ పూరి, కుర్మా అవీ వద్దంటే చికెన్ బిర్యాని.. వీటిల్లో ఏదన్నా చేయనా?" అనేసరికి, "వద్దు.. బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోనా.. ఓటీపీ చెప్తావా?" అన‌డిగింది అమ్ము. దాంతో సీరియస్ అయ్యింది సుమ.

ఇలా ఒక రీల్ చేసి పెట్టేసరికి నెటిజన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇదే తంతు అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. "ఈ రెస్టారెంట్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయనుకుంటున్నావ్ సుమా.. మన పిల్లల వల్లే.. మన మనశ్శాంతి పోగొట్టుకోవాలంటే పిల్లల్ని కనాలి".. ఇలా ఫన్నీ కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి ఈ రీల్ కి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.