English | Telugu

తన పెళ్లి వార్తలపై శ్రీముఖి ఏం చెప్పిందంటే...

హాట్ యాంకర్ శ్రీముఖి గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెర మీద ప్రసారమవుతున్న చాలా షోస్ కి హోస్ట్ ఆమె. కెరీర్ తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి మీద నిన్న మొన్నటి వరకు కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక బిజినెస్ పర్సన్ తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే టాక్ వినిపించింది. ఐతే శ్రీముఖి ఇప్పుడు ఈ రూమర్స్ పై ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. "తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు అని చెప్పింది. కొన్ని యూట్యూబ్ చానెల్స్ లో చూస్తే వాళ్ళ ఛానల్ రేటింగ్స్ కోసం మా నాన్న ముఖాన్ని బ్లర్ చేసి, అతన్ని పెళ్లి చేసుకుంటున్నట్లుగా గాసిప్స్ స్ప్రెడ్ చేయడం కూడా చూసాను...ఇది చాలా దారుణం. ఇలాంటి వాటిపై నేను స్పందించకుండా నా పని నేను చేసుకోవడమే చాలా బెటర్" అని అనుకుంటున్నట్లు చెప్పింది.

మరి పెళ్లి విషయం ఏమిటి.. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు "ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెట్ అవుతున్నాను. రాబోయే మూడు నాలుగేళ్ల వరకు నేను ఫుల్ బిజీ..ప్రస్తుతం ఉన్న లైఫ్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతం బీబీ జోడి షోకి హోస్టింగ్ చేస్తున్నాను. ఇది పూర్తయ్యాక కొన్ని రోజులు మా ఊరు వెళ్లి రావాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాను" అని చెప్పింది శ్రీముఖి. ఆల్రెడీ తన లైఫ్ లో ఒకానొక సమయంలో ఒక పర్సన్ తో బ్రేకప్ అయ్యిందని దాని నుంచి బయట పడడానికే చాలా టైం పట్టిందని ఒక షోలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు "బీబీ జోడి" "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోస్ కి హోస్టింగ్ చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.