English | Telugu

షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో యాంకర్ అనసూయ...ఫాన్స్ కి సందడే సందడి

ఈ మధ్య కాలంలో యాడ్స్ లో బుల్లితెర సెలబ్రిటీస్ సందడి చేస్తున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు హాజరవుతున్నారు. అలా అనసూయ ఇటీవలి కాలంలో షాప్ ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ కి వెళ్లి రిబ్బన్ కట్ చేస్తోంది.

ఇక ఇలా ఎవరైనా సెలెబ్స్ వచ్చారు అంటే చాలు.. వాళ్ళను చూడడానికి ఫాన్స్ ఎగబడుతూ ఉంటారు. హీరోస్ వస్తే గనక అంత పెద్ద హంగామా ఉండదు కానీ హీరోయిన్స్ వస్తే ఆ క్రేజ్ వేరే..అలాంటి కిక్ ఇచ్చే బుల్లితెర సెలెబ్రెటీగా అనసూయ మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ డాన్స్ చేయడం, చేయించడం సరదాగా అలరించడం వంటివి చేస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ ని, ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా అనసూయ శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా బాలాజీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లి రిబ్బన్ కట్ చేసింది.

ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అనసూయని చూసేందుకు జనం భారీఎత్తున తరలివచ్చారు. స్కై బ్లూ కలర్ శారీలో అనసూయ గోర్జియస్ లుక్ లో అదిరిపోయింది. అంత రద్దీలో కూడా తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇచ్చింది. మరో ట్విస్ట్ ఏమిటి అంటే లాస్ట్ లో చిన్న డాన్స్ స్టెప్స్ కూడా వేసి ఖుషి చేసింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి యాక్టర్ గా మారింది అలాగే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ, బుల్లితెర మీద షోస్ కి హోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటూ దూసుకుపోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.