English | Telugu

బర్త్‌డే బేబీ శ్యామల!

యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మూవీ ప్రమోషన్స్ కి, బుల్లితెర షోస్‌కి హోస్ట్‌గా చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత యాంకర్‌గా సెటిల్ అయ్యి ఫుల్ బిజీ అయిపోయింది. యాంకర్‌గా గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో బిగ్బాస్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది.

హౌస్ నుంచి వచ్చాక ఈమె క్రేజ్ చాలా పెరిగింది. టీవీ షోస్, ప్రీరిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ ఈవెంట్లు.. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అప్పుడప్పుడు మూవీస్‌లో కూడా అడపాదడపా కొన్ని రోల్స్‌లో నటిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తన యుట్యూబ్ ఛానల్‌లో రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ లైంలైట్‌లోఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు శ్యామల తన పుట్టిన రోజు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలోషేర్ చేసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్యన శ్యామల తన బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. భర్త నరసింహ, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈమె భర్త నరసింహ ఒక పక్కన 'కార్తీక దీపం'లో దుర్గ కేరక్టర్‌లోలో నటిస్తున్నాడు. ఇటీవల 'ఎక్స్‌పోజ్డ్ 24'అనే వెబ్ సిరీస్‌లో మిత్ర అనే రోల్‌లో ఆకట్టుకున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.