English | Telugu

మూగజీవాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన రష్మీ!


యాంకర్ గా రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద ఒక స్టార్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ వారంలో మూడు రోజుల పాటు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి సినిమా ఆఫర్స్ వస్తే అందులో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఫుల్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అవకాశాలను వినియోగించుకుంటోంది.

ఎంతో హ్యాపీ గా ఉండే రష్మీ తన మనసులో మూగ జీవాలంటే ఆవేదనతో ఉంటూనే ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫొటోస్ కన్నా ఇలా మూగజీవాలు పడుతున్న బాధల్ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది. అది ఏంటంటే ఆకాశ ఎయిర్ లైన్స్ వాళ్ళు ప్యాసెంజర్స్ తో పాటు వాళ్ళ పెట్స్ కి కూడా త్వరలోనే అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుకింగ్స్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నాయి. ఎప్పటికీ ఇదొక గుడ్ న్యూస్ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. రష్మీ యానిమల్ లవర్. వాటికి హాని జరిగితే ఆమె మనసు భరించలేదు.

మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునేలా కూడా సంబంధిత అధికారులకు ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ''జంతువులకు సాయం చేసే పరిస్థితి అందరికీ ఉండదు. కానీ వాటికి హాని చేయకూడదని అనే విషయం కూడా అందరికీ తెలుసు" అని చెప్పింది. వాటికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని హింసించే రైట్ ఎవరికీ లేదు అంటూ ఘాటుగా తిట్టింది ఈ పోస్ట్ ద్వారా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.