English | Telugu

పెళ్లిరోజు భర్త‌కు ‌లాస్య ఇచ్చిన గిఫ్ట్ ఇదే!

బిగ్‌బాస్ సీజ‌న్ 4లోకి వెళ్లాక లాస్య లైఫ్ స్టైలే మారిపోయింది. యాంక‌ర్‌గా ర‌వితో కెరీర్ ప్రారంభించిన లాస్య ఆ త‌రువాత అత‌నితో విడిపోయి టీవీ షోల‌కు దూర‌మైన విష‌యం తెలిపిందే. మ‌ళ్లీ బిగ్‌బాస్ సీజ‌న్ 4 త‌రువాత మ‌ళ్లీ ర‌వితో క‌లిసి ప్రోగ్రామ్‌లు చేస్తూ య‌మ బిజీగా మారిపోయింది. త‌న‌కంటే చిన్న‌వాడైన మంజునాథ్‌ని వివాహం చేసుకున్న లాస్యకు ఓ బాబు కూడా వున్నాడు.

అన్యోన్య దాంప‌త్య జీవితాన్ని లీడ్ చేస్తున్న లాస్య త‌న పెళ్లిరోజు సంద‌ర్భంగా భ‌ర్త మంజునాథ్‌ని స‌ర్ప్రైజ్ చేసింది. పెళ్లి రోజు కానుక‌గా త‌న భ‌ర్త‌కు కారుని గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌హీంద్రా 500ఎక్స్ యూవీని బహుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లోనూ షేర్ చేసింది.

ఈ నెల 15న లాస్య పెళ్లి రోజు కావ‌డంతో జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి టెంపుల్‌లో భ‌ర్త‌తో క‌లిసి వెళ్లి కొత్త కారుకి ప్ర‌త్యేక పూజ‌లు చేయించి మురిపిసోయింది లాస్య‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.