English | Telugu

Eto Vellipoyindhi Manasu:మాణిక్యానికి గన్ గురిపెట్టిన సీతాకాంత్.. రామలక్ష్మి పయనం ఎటువైపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో.. సీతాకాంత్ తనతో అన్న మాటలన్నీ సిరి గుర్తుకు చేసుకుని బాధపడుతుంది. ఇక నాకు ధన దూరం అయినట్లేనా.. ఇక నాకు చావే మార్గమని సిరి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు మాణిక్యాన్ని చంపడానికి సీతాకాంత్ రివాల్వర్ పట్టుకొని బయలుదేర్తాడు. అప్పుడే తన తాతయ్య ఆపి నీ కోపం మాణిక్యం.. అతని కొడుకు మీద.. అంతేగానీ రామలక్ష్మి మీద కాదు. అది గుర్తుకు పెట్టుకో ఆవేశపడకని పెద్దాయన చెప్తాడు.

ఆ తర్వాత వాళ్ళందరు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసారు. రామలక్ష్మి కూడా అంతే అని సీతాకాంత్ అనగానే.. నువ్వు పొరపాటు పడుతున్నావ్ రామలక్ష్మి నిజాయితీ గల అమ్మాయి అనగానే సీతాకాంత్ కోప్పడుతూ... ఏంటి నిజాయితినా సిరి ప్రేమించింది వాళ్ళ తమ్ముడినే అని తెలిసినా చెప్పలేదు. కావాలనే నాకు జాలి కలిగేలా చేసి జాబ్ లో జాయిన్ అయింది. అంతా మోసమని సీతాకాంత్ చెప్పి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మి కాళ్ళ మీద మాణిక్యం పడి.. అల్లుడు చెప్పింది నమ్ముతున్నావా అని అంటాడు... నువ్వే ఎలాగైనా నన్ను అల్లుడి నుండి కాపాడాలి.. చిన్నప్పుడు ఈ చేతుల్తో పెంచాను.. మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాడు లేదంటే ప్రాణం తీస్తాడని మాణిక్యం అంటాడు.

ఆ తర్వాత మిమ్మల్ని ఎలాగైన కాపుడుకుంటానని రామలక్ష్మి తన నాన్నకి చెప్తుంది. అప్పుడే సీతాకాంత్ రివల్వర్ పట్టుకొని వచ్చి మాణిక్యాన్ని షూట్ చేయబోతుంటే.. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొని చంపండి అని మాణిక్యం అంటాడు. అయిన వినకుండా షూట్ చేయబోతుంటే రామలక్ష్మి అడ్డుపడుతుంది. ఆ తర్వాత అప్పుడే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి సిరి విషయం చెప్తాడు. వెంటనే సీతాకాంత్ హాస్పిటల్ కి వెళ్తాడు. సిరి సూసైడ్ అటెంప్ట్ చేసిందని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు మళ్ళీ రామలక్ష్మి తన ఫ్యామిలీని తీసుకొని వేరొక దగ్గరికి వెళ్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.