English | Telugu

నాకు నేర్పిన జీవిత పాఠాల్లో ఒకటి..

అనసూయ ఒక బోల్డ్ యాక్టర్ మాత్రమే కాదు బోల్డ్ హోస్ట్ కూడా..ఎవరన్నా ఏమన్నా అంటే చాలు ఫైర్ బ్రాండ్ లా మీద పడిపోతుంది అనే కామెంట్స్ ఆమె మీద నిత్యం వస్తూనే ఉంటాయి. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ యాంకర్ గా మారింది. అలాంటి అనసూయ ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఈ ఇయర్ ఎవరికీ ఎం నేర్పిందో కానీ తనకు ఒక జీవిత పాఠం నేర్పింది అంటూ పోస్ట్ చేసింది. "మిమ్మల్ని మీలోని ట్రాన్సఫార్మ్ అయ్యే శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. అలాగని మీ శక్తితో వేరే వాళ్ళని మార్చేయగలం అంటూ అతిగా కూడా ఆలోచించకండి. దేన్నైనా మార్చగల శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉందని గుర్తుంచుకోండి.

ఎందుకంటే ముళ్ళను ఎంత ఎక్కువగా ప్రేమించగలుగుతారో గులాబీలను కూడా అంతే ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంటుంది. అప్పుడే మీరు మరింత పవర్ ఫుల్ గా మారతారు" అంటూ రాసుకొచ్చింది అనసూయ. ఇక అనసూయ నటించిన 'రజాకర్' మూవీ త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక అనసూయ పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. " అను లాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు..మీరు గోర్జియస్" అంటున్నారు. అనసూయ క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి మూవీస్ లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. దాంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది..

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.