English | Telugu
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. అక్క బాటలో అనసూయ చెల్లి!
Updated : Oct 20, 2022
ఏ ఫీల్డ్ లో ఐనా సరే ఒక ఇంట్లోంచి ఒకరు బయటికి వచ్చి సక్సెస్ ఐతే వాళ్ళ అడుగుజాడల్లో మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఇలా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. అన్నలు తమ తమ్ముళ్లను తీసుకొస్తారు, అక్కలు తమ చెల్లెళ్లను తీసుకొస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫైర్ బ్రాండ్ యాంకర్ అనసూయ చేరింది. ఆమెతన చెల్లెలు వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
తన చెల్లెలికి ఇప్పుడు అనసూయ వెనక నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తోంది.. అనసూయకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరిలో వైష్ణవి ఒకరు. ఆమెలో అనసూయ పోలికలు ఎక్కువ. అనసూయ తన తండ్రి మరణంతో చెల్లి వైష్ణవి కెరీర్ బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని ఒక షో కోసం రికమండ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నదంటూ వార్తలు వస్తున్నాయి. బుల్లితెర మీద, వెండితెర మీద నటిగా తన సత్తా చాటుతోంది అనసూయ. ఎన్నో అవమానాలను తట్టుకున్న అనసూయ ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు తన చెల్లి ఎలా రాణిస్తుందో.. ఇండస్ట్రీలో ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.