English | Telugu

తన హెయిర్ డ్రెస్సర్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన ఖుష్భు

ఖుష్భు.. జబర్దస్త్ జడ్జిగా ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న పేరు. ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తోంది జబర్దస్త్. ఒక స్కిట్ లో టైం మెషిన్ కాన్సెప్ట్ ఉండేసరికి కుదిరితే వెనక్కి వెళదాం అనుకుంటే ఎవరు ఎం కోరుకుంటారు అని రష్మీ అడిగింది. " కుష్బూ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..” నేను 1984లో మూవీస్ చేయడం స్టార్ట్ చేసాను. అప్పుడు నాతో ఉబెన్ ఆంటీ వచ్చారు. ఆమె నా హెయిర్ డ్రెస్సర్. అప్పటి నుంచి 2011 వరకు నా దగ్గరే ఉంది. కానీ క్యాన్యర్ తో ఆమె చనిపోయింది..ఆమె నన్ను ఎంతో సపోర్ట్ చేసేవారు నా గైడ్ కూడా ” అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. జీవితంలో ఒకసారి వెనక్కి వెళితే ఆమె చనిపోకూడదు అని నేను కోరుకుంటాను అని ఆమె అన్నారు.

"నేను ఒక్కరోజు వెనక్కి పోతా ఎందుకంటే నిన్న తాగలేదు" అన్నాడు సన్నీ. "నువ్వేం కోరుకుంటావ్ అని రాంప్రసాద్ రష్మీని" అడిగేసరికి గెటప్ శీను ఆన్సర్ ఇచ్చాడు "2014 కి ఫిబ్రవరి 14 కి వెళ్తావ్ అనేసరికి రష్మీ కన్నుకొట్టి ఇంకేం చెప్పొద్దూ అని శీనుకు సైగ చేసింది. మరి అప్పట్లో సుధీర్, రష్మీ జోడి బుల్లితెర మాములుగా ఎంటర్టైన్ చేయలేదుగా మరి. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాలను గుర్తు చేసాడు శీను. ఖుష్బూ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించారు. కలియుగ పాండవులు, పేకాట పాపారావు, స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి మూవీస్ లో నటించారు. ఆమెపై అభిమానంతో అభిమానులు ఆమె కోసం గుడి కూడా కట్టేశారు. మూవీస్ చేయడం కాస్త తగ్గించి పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.