English | Telugu
ఎయిర్‌లైన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ అనసూయ!
Updated : Oct 19, 2022
అనసూయ బుల్లితెర ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి అనసూయ ఫామిలీ బయల్దేరింది.ఐతే వీళ్ళు ప్రయాణించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ వాళ్ళు ఫ్లైట్ రన్ వే మీద నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు.
ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపించలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళే అవసరం లేదు అన్నారు. ఇక ఆఖరి నిమిషంలో ఫామిలీ మొత్తాన్ని ఈ ఎయిర్ లైన్ సిబ్బంది వాళ్ళు పరిగెత్తించారు. ‘అలయన్స్ ఎయిర్ 9I 517 ప్లైట్ ప్రొటోకాల్ వలన చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఈ ఎయిర్ లైన్ సిబ్బందికి ఎందుకు ఇంత కన్‌ఫ్యూజన్. పోనీ విమానం ఎక్కాక సీట్లు కూడా ఎక్కడెక్కడో ఇచ్చారు. వరుసగా సీట్లు బుక్ చేసుకున్నప్పుడు వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదట.
ఇక ఆ పరిగెత్తిన హడావిడిలో , ఆ కంగారులో నా షర్ట్ సీటుకు తగిలి చిరిగిపోయింది. పాసెంజర్స్ కి చెప్పే ముందు మీరు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి’ అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. విమాన సిబ్బంది కారణంగా అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులను ట్వీట్ రూపంలో సోషల్ మీడియాలో చెప్పింది. ప్యాసింజర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.