English | Telugu

నెలలో మూడు రోజులు అడ్జస్ట్ చేసుకోలేవా?.. నిలదీసిన చంటి!

అన్ని షోస్ లోకి జబర్దస్త్ ఇప్పుడు ఫుల్ ఫేమస్ ఐపోయింది. అందులోని కమెడియన్స్ చేస్తున్న ఆరోపణల కారణంగా కావొచ్చు , ఒక్కొక్కరిగా ఈ వేదిక విడిచి వెళ్లిపోతుండడం కారణం కావొచ్చు ఏదైనా సరే అందరూ ఈ షో గురించే అందరూ మాట్లాడుతుకుంటున్నారు. ఏమి లేని స్థాయి నుంచి ..పేరు లేని ఊరు నుంచి వచ్చి ఈ స్టేజి మీద ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్స్ ఇప్పుడు అన్ని షోస్ లో కనిపిస్తున్నారు. ఈ షోలో టీం లీడర్స్ అంతా కూడా వేరే చానెల్స్ లో, మూవీస్ లో నటిస్తూ ఇంకా ఇంకా ఫేమస్ అవుతున్నారు. ఐతే కొంతమంది ఈ షో నుంచి వెళ్లిపోయారు.

ఇదే నేపథ్యంలో అనసూయ కూడా జూన్ లోనే జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోతున్నట్టు సంకేతాలు ఇస్తూ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. కానీ జులై ఎండింగ్ వరకు కూడా షో లో కంటిన్యూ అయ్యింది. ఐతే ఇప్పుడు అనసూయ నిజంగా వెళ్ళిపోతున్నట్టుగా రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమోలో చూపించి జబర్దస్త్ వేదికగా అనసూయకు ఘనంగా వీడ్కోలు చెప్పించారు యాజమాన్యం. ఇలా వెళ్ళిపోతున్న అనసూయ కోసం ఒక స్కిట్ కూడా వేశారు. తాగుబోతు రమేష్ అనసూయలా లేడీ గెటప్ లో వచ్చి "నేను నిజంగా జబర్దస్త్ మానేయాలని అనుకుంటున్నా" అని చెప్పాడు. "మీకు చిన్నచిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళను మీ అమ్మగారికి ఇచ్చి జబర్దస్త్ కోసం మీరు పని చేశారు. ఇప్పుడు జబర్దస్త్ ను వదిలేయడం ఏంటి మేడం" అని వెంకీ కూడా ఒక ఎమోషనల్ డైలాగ్ వేసాడు. "జబర్దస్త్ అనేది పెర్మనెంట్ సర్..ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు..కానీ జబర్దస్త్ స్టిల్ రన్నింగ్ " అంటూ తాగుబోతు రమేష్ ఎమోషనల్ డైలాగ్ వేస్తాడు. ఈ డైలాగ్ కి చలాకి చంటి ముఖం డల్ గా కనిపిస్తుంది. ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇక చంటి మైక్ తీసుకుని "నెలలో మూడు రోజులు మాకోసం అడ్జస్ట్ చేయలేవా " అని ఎమోషన్ గా అడుగుతాడు. కష్టం అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనసూయ. ఇక ఇంద్రజ ఆగలేక బాధను తట్టుకోలేక అనసూయను హగ్ చేసుకుంటుంది. "ఈ జర్నీలో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇస్తుంది..కానీ జబర్దస్త్ మాత్రం ఆగదు..కొత్త కొత్త కామెడీతో, కొత్త కొత్త ఆర్టిస్టులతో జబర్దస్త్ మీ ముందుకు వస్తూనే ఉంటుందని రాకెట్ రాఘవతో చెప్పించారు. "ఈ స్టేజి నీతో చాలా అనుబంధాన్ని పెంచుకుంది అనసూయ" అని అంటుంది ఇంద్రజ. ఏదైమైనా అందరూ కొంచెం ఎమోషన్ అయ్యారు కానీ అనసూయ మాత్రం కన్నీళ్లను మింగేసి బయటికి రానివ్వకుండా ఆ బాధను ఫేస్ లో కొంత మైంటైన్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.