English | Telugu

సుధీర్ జూనియర్..నేను సీనియర్.. మర్చిపోయారా ? రిపోర్టర్ కి గట్టిగా ఇచ్చిన అనసూయ!

అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకుని పెద్ద పెద్ద మూవీస్ లో మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సుడిగాలి సుధీర్ కూడా అనసూయతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఆ ఒదిగి ఉండే గుణంతోనే సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.

ఐతే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో అనసూయ సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. అనసూయ రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ఫలో మంగళం శ్రీను భార్య పాత్రలో మెరిసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది. ఐతే ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనసూయను " సుధీర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ? అని రిపోర్టర్ అడిగేసరికి ఆమె కాస్త సీరియస్ అయ్యింది. “సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ ని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్ ని అడగండి నన్ను కాదు. అతడు నా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. నేనూ అతడి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను” అని అనసూయ చెప్పింది.

ఐతే అనసూయ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. సుధీర్ ను జూనియర్ అనడం ఏంటి ? ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్లు అనసూయను ఘాటుగా తిడుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.