English | Telugu

దాన్ని చూసి మనమంతా బుద్దితెచ్చుకోవాలి...అనసూయ ఫైర్

బుల్లితెర మీదైనా, సిల్వర్ స్క్రీన్ పైనైనా, సోషల్ మీడియాలో ఐనా ఫైర్ బ్రాండ్. ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అని వాళ్లకు తగ్గట్టుగానే బుద్దొచ్చే సమాధానం ఇస్తుంది. "ఆంటీ" అంటూ ట్రోల్స్ చేసినవారిని కడిగిపారేసింది. వాలెంటైన్స్ డే రోజున కూడా ఒక నెటిజన్ కి ఫుల్ కోటింగ్ ఇచ్చేసింది. "నీతో లైఫ్ చాలా క్రేజీ" అనే కాప్షన్ తో తన హజ్బెండ్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి పెట్టుకుంది. "అలా ఏం లేదు అక్కా.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అందుకే" అని ఒక నెటిజన్ కామెంట్ చేసేసరికి అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా ? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతోటి.. సారీ నా అర్థం చెప్పులతో చెంపలేస్తానని" అంటూ ఫుల్ గా యుద్ధం చేసింది. అనసూయకు మూగ జీవాలంటే చాలా పిచ్చి కూడా..ఇంట్లో చాలా పెంచుకుంటూ ఉంటుంది.

చిలకలకి భాష నేర్పించి మాట్లాడిస్తూ ఉంటుంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఎక్కడిదో తెలీదు కానీ. ఒక ఇద్దరు మనుషులు స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ పెట్టిన రెడ్, గ్రీన్ స్టాండ్స్ నీళ్ళల్లోకి పడిపోయేసరికి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న సీల్ వాళ్లకు హెల్ప్ చేసింది. వాటిని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ గట్టు మీద నిలబెట్టింది. అనసూయ " వాట్ ఏ క్యూటీ బుద్ది తెచ్చుకోవాలి మనం" అంటూ కాప్షన్ పెట్టుకుంది. నిజమే కదా మనుషులు ఆలోచించలేని విషయాలను మూగజీవాలు ఆలోచిస్తాయి అనడానికి ఇదే నిదర్శనం..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.