English | Telugu

నేను పరుపు... నువ్వు ఎరుపు... ఆది డబుల్ మీనింగ్ డైలాగులు

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. డాన్సస్ అన్నీ ఒక రేంజ్ లో అలరిస్తుంటే ఆది కామెడీ మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే సాగుతోంది. ఢీ-15 రాబోయే ఎపిసోడ్ 'వైల్డ్ కార్డ్ స్పెషల్' థీమ్‌తో నెక్స్ట్ వీక్ ఎంటర్టైన్ చేయనుంది. ఫస్ట్ కంటెస్టెంట్ డాన్స్ చేసాక ఆది గబ్బర్ సింగ్ గెటప్ లో గన్ పట్టుకుని స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. "గెటప్ వేయడం కాదు.. నీలో ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉందా" అని యాంకర్ ప్రదీప్ అడగ్గానే "రబ్బర్ పన్నంగా..రబ్బర్ తీసి మార్చి పన్నంగా.. ఆరేయ్ ఎప్పుర్రా" అంటూ సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అయిన బుడ్డోడి డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించాడు ఆది.

తర్వాత చేతిలో ఉన్న గన్ ని పవన్ కళ్యాణ్ తిప్పినట్టు తిప్పడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు ఆది. బిగ్ బాస్ జెస్సీ కూడా పోలీస్ గెటప్ లో పక్కనే ఉండి "ఉత్తుత్తినే గన్ తీస్తావ్ తప్ప ఆ గన్ పేలదు, అందులో బుల్లెట్లు ఉండవు" ఆది పరువు తీసేసాడు. ఆది అందుకుని "వెళ్లి శ్రుతిహాసన్‌ను పిలు" అని చెప్పగానే "ఆగు ఇంకా డైలాగ్ ఉందని" మరోసారి కౌంటర్ వేసేశాడు జెస్సి. "అయ్యబాబోయ్ నాకు డైలాగ్ గుర్తుచేసే స్టేజికి ఎదిగిపోయాడేమిటి" అని ఆది తెగ ఫీలైపోయాడు. ఇంతలో వీళ్ళ టీమ్ లో ఉండే దివ్య వచ్చింది. ఆమెను చూసి "ఏదో ఒక రోజు నువ్వు నాకు కచ్చితంగా పడతావ్ తెల్సా" అన్నాడు ఆది. "అలా పడడానికి నేను మామూలు అమ్మాయిని కాదు.. నేను మెరుపు" అని జుట్టు ఎగరేసేసరికి "నేను పరుపు" అన్నాడు ఆది మరి నేను అని జెస్సి అనేసరికి "నువ్వు ఎరుపు" అంటూ బూతు డైలాగ్ వేసాడు ఆది. ఇక ఈ షో 22 న ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.