English | Telugu

బర్రెల గురించి తెలీదు కానీ బఫెలో లోన్ కావాలంట

క్యాష్ షోకి ఈ వారం లవ్లీ కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుంచి హరికృష్ణ-ప్రశాంతి, సుధీర్-అస్మిత, ఆట సందీప్-జ్యోతిరాజ్, అమ్మ రాజశేఖర్ - రాధా వచ్చారు. ఇక సుమ పంచ్ డైలాగ్స్ వేసి ఎంటర్టైన్ చేసింది. మొగుడు పెళ్లాలంటే పౌడర్, అద్దంలా ఉండాలి అని అమ్మ రాజశేఖర్ పెయిర్ కి చెప్పింది. ఇక తర్వాత భార్యలకు ఒక అదిరిపోయే టాస్క్ కూడా ఇచ్చింది. లిప్ స్టిక్ వేసుకుని వాళ్ళ వాళ్ళ భర్తల పేరులోని ఫస్ట్ లెటర్ ని పేపర్ మీద లిప్స్ తో రాయాలి అని చెప్పింది.

ఇక అందరూ స్పీడ్ గా టాస్క్ కంప్లీట్ చేస్తే అమ్మ రాజశేఖర్ వైఫ్ కంప్లీట్ చేయకపోయేసరికి ఒక అరగంట టైం ఇవ్వండి అని అడిగేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ లోన్ ఇచ్చే ఏజెంట్ అవతారం ఎత్తింది సుమా. "బర్రెలు కొనుక్కోవడానికి బఫెలో లోన్ కావాలి అని అడిగేసరికి వాళ్ళ వైఫ్ మధ్యలో వచ్చి ఆడ గేదె పాలిస్తుందా, మగ గేదె పాలిస్తుందా అనే విషయమే తెలియదు" అని చెప్పేసరికి ఇలాంటాయనకు లోన్ ఎలా ఇవ్వాలి" అని అరిచింది సుమ. ఇక "ఆట సందీప్ వచ్చి నా వైఫ్ కి తాజ్ మహల్ కట్టిద్దామనుకుంటున్న అనేసరికి జ్యోతి వచ్చి ముద్దు పెడుతుంది..ఆ సీన్ చూసిన సుమ ఏంటి పొంగిపోతున్నావ్ తాజ్ మహల్ అంటే సమాధి..నువ్ బతికుండగానే సమాధి కట్టిస్తాడట" అనేసరికి అందరూ నవ్వేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.