English | Telugu
రైతు బిడ్డకు అఖిల్ సార్థక్ సపోర్ట్.. అమర్ దీప్ పరిస్థితి ఏంటి?
Updated : Sep 13, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో గత రెండు రోజులుగా హీటెడ్ నామినేషన్లే కొనసాగుతున్నాయి. అయితే నామినేషన్ ప్రక్రియలో రైతులని ఉద్దేశించి అమర్ దీప్ మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ లోకి పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ గా అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. హౌజ్ లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో 9 మంది ప్రశాంత్ ని నామినేట్ చేశారు. గత రెండు రోజులుగా పల్లవి ప్రశాంత్ వన్ మ్యన్ షో గా ఈ విషయం నడుస్తుంది.
హౌజ్ లో అందరూ ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో ప్రేక్షకులకు తనపై మరింత సింపతీ పెరిగిపోయింది. అంతేకాకుండా గత వారం కంటే కూడా ఈ వారం భారీగా ఓట్లు పడుతున్నాయి. రైతులంత పల్లవి ప్రశాంత్ పక్షాన నిల్చొని సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ లో ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రశాంత్ టాస్క్ లో బెస్ట్ ఇవ్వగలిగితే ప్రశాంత్ టాప్ 5 లో ఉండడం కన్ఫమ్ అయినట్టే అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు. మొన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ ని నాగార్జున మెచ్చుకోవడంతో తోటి కంటెస్టెంట్స్ కి తక్కువగా అనిపించి అందరూ అతడినే టార్గెట్ చేశారు.
అయితే నిన్న, మొన్న జరిగిన నామినేషన్ లో ప్రశాంత్ తో హౌస్ మేట్స్ ప్రవర్తించిన తీరుపై అఖిల్ సార్థక్ స్పందించాడు. ప్రశాంత్ కి ఫస్ట్ హౌజ్ లో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. నామినేషన్ లో ప్రశాంత్ రాంగ్ గా ఏం మాట్లాడలేదు. అందరు అతన్ని టార్గెట్ చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తను రైతు అంటున్నాడు. మీరు యాక్టింగ్ నుండి వచ్చారు కాబట్టి యాక్టర్ అని చెప్పుకోవడం లేదా? బయట ఎలా ఉన్నావ్, ఇప్పుడు ఇలా ఉన్నావని అమర్ దీప్ అంటున్నాడు. అంటే సిట్యుయేషన్ తగ్గట్టు ఉంటున్నాడు అంటే మిమ్మల్ని బ్రతిమిలాడుకోవాలా నామినేట్ చేయొద్దని, ఇంకా రతిక గురించి మాట్లాడుతూ లేని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేసిందంటూ ప్రశాంత్ కి సపోర్ట్ గా అఖిల్ సార్థక్ ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. 'ప్రశాంత్ బీ స్ట్రాంగ్.. జై జవాన్ జై కిసాన్' అంటూ అఖిల్ సార్థక్ చేసిన ఈ పోస్ట్ కి ఇప్పుడు విశేష స్పందన లభిస్తుంది. పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ సీజన్-4 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, రన్నర్ అఖిల్ సార్థక్ మద్దతు లభించింది.