English | Telugu
పూర్ణ ఇల్లు ఎంత పాష్‌గా ఉందో చూశారా?
Updated : Jun 8, 2021
తెలుగులో 'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. ఆ తరువాత 'సీమ టపాకాయ్', 'అవును' వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా ఓకే అనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలలో న్యాయ నిర్ణేతగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్స్ యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టి పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. పూర్ణ కూడా కొంతకాలం క్రితం సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. తాజాగా తన హోమ్ టూర్ వీడియోను పోస్ట్ చేసింది.
చుట్టూ చెట్లు.. మధ్యలో ఉన్న తన ఇంటిని అభిమానులకు చూపించింది. ముందుగా తను పెంచుకుంటున్న పక్షులను, తన దగ్గరున్న మూడు కార్లను చూపించింది. 2009లో తను సంపాదించిన డబ్బుతో ఇన్నోవా కారు కొనుక్కున్నానని.. ఆ కార్ అంటే తనకు సెంటిమెంట్ అని చెప్పింది. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా మార్చలేదని తెలిపింది. అలానే హ్యుందయ్ కంపెనీకి చెందిన ఓ కారు ఉన్నట్లు చూపించింది. తనకు డ్రైవింగ్ పెద్దగా రాకపోయినా ఆ కారు మీద ట్రయల్స్ వేస్తానని చెప్పింది.
పాష్ గా ఉండాలని ఆడి కారు తీసుకున్నానని.. కానీ పెద్దగా వాడనని చెప్పింది. అనంతరం తన ఇంట్లో ఉన్న హాలుని చూపిస్తూ.. అక్కడ ఉన్న వస్తువుల గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో ఎక్కువ సమయం కిచెన్ లో, అలానే తన బెడ్ రూమ్ లో గడుపుతానని చెప్పింది. తనకు వంట పెద్దగా రాదని.. కానీ క్లీనింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంట్లో ఉన్న ఫోటోలను చూపిస్తూ.. స్టోరీలను చెప్పుకొచ్చింది. ఆ తరువాత తను డాన్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ ని చూపించింది. అనంతరం తన బెడ్ రూమ్ ని చూపిస్తూ అదే తన హెవెన్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన ఆల్బమ్ ని చూపిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.