English | Telugu

ఇమ్మ్యూనిటి లెవెల్స్ తగ్గిపోయాయి.. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయింది...


నటి మాధవి లతా కొంతకాలం క్రితం వరకు మూవీస్ లో చేస్తూ ఉండేది. కానీ మూవీస్ కి బైబై చెప్పేసి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సోషaల్ ఇష్యూస్ మీద తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు, వీడియోలు పెడుతూ ఉంటుంది. ప్రతీ ఇష్యూ మీద ఆమె స్పందిస్తూ ఉంటుంది. అలాంటి మాధవి లతాకి ఆరోగ్యం బాగాలేక వీడియోస్ చేయడం లేదు. ఐతే రీసెంట్ గా తన హెల్త్ అప్డేట్ మీద ఒక వీడియోని చేసి పోస్ట్ చేసింది. "రెండేళ్ల నుంచి హెల్త్ అసలు సహకరించడం లేదు. బాగా మైగ్రేన్ ఉంది. దాంతో సరిగా నిద్ర పట్టడం లేదు. ఆ కారణంగా ఇమ్మ్యూనిటి పవర్ తగ్గుతోంది..అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ పది నిమిషాలు కూడా నడవలేకపోతున్న.. అసలు అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తోంది. మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా కానీ ఫిజికల్లీ చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేను. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల హెల్త్ చాలా డెలికేట్ గా ఉంటుంది.

అందుకే అమ్మాయిలు ఫిజికల్లీ వీక్ గ ఉన్నప్పుడు మెంటల్లీ కూడా వీక్ ఐపోతారు. అసలు మాట్లాడానికి కూడా నాకు ఓపిక ఉండడం లేదు. గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్న. నాకు మొదటి సరి ఏడవ తరగతి చదివేటప్పుడు మైగ్రేన్ ఎటాక్ అయ్యింది. కింద నుంచి పైన ఉన్న నా గదికి వెళ్ళడానికి అంటే 15 మెట్లు ఎక్కడానికి కూడా నాకు వీక్ నెస్ వస్తోంది. కాసేపు ఫోన్ పట్టుకున్నా కూడా చేతులు నరాలు నొప్పులు వస్తున్నాయి. ఇమ్మ్యూనిటి లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే ఎలాంటి వీడియోస్ ని సరిగా చెయ్యట్లేదు. స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలన్సు ఇవన్నీ కలిపి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నా"...అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఏడుస్తూనే ఆ వీడియోలో తన బాధల్ని చెప్పుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.