English | Telugu

మై బెటర్ హాఫ్.. క్యాప్షన్ సేస్ ఎవ్రీథింగ్!

కీర్తిభట్.. బిగ్ బాస్ సీజన్-6 తో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన బిహేవియర్ తో మొదట్లో కాస్త నిరాశ కలిగించిన, మెల్లగా ప్రేక్షకులకు నచ్చేసింది. తన ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని తను చెప్పినప్పుడు ఆ ఎపిసోడ్ అంతా చాలా ఎమోషనల్ గా సాగింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాప్-5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్న కీర్తిభట్ మొదట ఆర్జే సూర్యతో స్నేహంగా ఉండేది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పడేది కాదు. హౌస్ లో రోజులు గడిచేకొద్దీ అందరికి దగ్గరైన కీర్తభట్.. ఫ్యామిలీ వీక్ లో ఒక్కో కంటెస్టెంట్ వాళ్ళ అమ్మ, నాన్న వచ్చినప్పుడు తను చాలా బాధపడింది. అయితే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తనకు అన్నీ మంచి రోజులు వస్తాయంటూ అప్పట్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సింపతితో ప్రతీ వారం తను నామినేషన్లలో ఉన్నప్పుడు అత్యధిక ఓట్లు వేసి హౌస్ లోనే కొనసాగేలా చేశారు. అలా బిగ్ బాస్ లో ఉన్నప్పడే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కీర్తిభట్ కన్నడలో చాలా సీరియల్స్ చేసింది‌ అయితే తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేయగా.. బిగ్ బాస్ తర్వాత "మధురానగరిలో " సీరియల్ లో లీడ్ రోల్ చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది. కాగా తాజాగా తను పెళ్ళి చేసుకుంటున్నట్టు చెప్పిన కీర్తిభట్.. ఇప్పుడు తను చేసుకోబోయే అతడితో కలిసి ఒక పోస్ట్ చేసింది. 'మై బెటర్ హాఫ్.. క్యాప్షన్ సేస్ ఎవ్రీథింగ్' అనే టైటిల్ ని పెట్టి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కి బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.