English | Telugu
నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారు
Updated : Dec 11, 2022
అస్మిత బుల్లితెర మీద ఫుల్ పాపులర్ యాక్టర్. అలాగే సోషల్ మీడియా క్వీన్ కూడా. 'యష్ ట్రిక్స్' పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ వీడియోస్ లో ఓన్ గా మేకప్ కిట్ లు ఎలా తయారు చేసుకోవచ్చు.. వాటికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాల మీద ఆమె చేసిన ఎన్నో వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి. అంతే కాదు అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు 'ఎ1 ఫ్రమ్ డే1' అనే వెబ్ సిరీస్ ని రూపొందించింది అస్మిత. "నేను నటిగా బిజీగా ఉన్న టైంలోనే డిజిటల్ మీడియాని అర్ధం చేసుకుంటూ అటు వైపు నా ప్రయాణం స్టార్ట్ చేసాను. సీరియల్స్ లో, సినిమాల్లో పాపులర్ అయ్యాక మళ్ళీ యూట్యూబర్ గా మారడమేంటని చాలామంది నన్ను అడిగారు. అసలు ఇలాంటివి ఎవరు చూస్తారు అని ఎగతాళి కూడా చేశారు. కానీ నన్ను అలా ఎగతాళి చేసిన ప్రతీఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నా యష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహకారం చాలా ఉంది. ఇక ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో మా గొడవల్ని ఒక కథగా రాసి 'ఎ1 ఫ్రమ్ డే1' అనే వెబ్ సిరీస్ చేసాం. ప్రత్యేకంగా కథ రాయడం కంటే మన లైఫ్ లో జరిగిన వాటినే కథ రాస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇక ఈ సిరీస్ లో ఫోర్ ఎపిసోడ్స్ ఉంటాయి. దీని సక్సెస్ ని బట్టి సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తాము" అని చెప్పారు అస్మిత, సుధీర్.