English | Telugu
అన్నపూర్ణమ్మ పరువు తీస్తున్న జబర్దస్త్ కమెడియన్స్!
Updated : Dec 11, 2022
ఇటీవలి కాలంలో జబర్దస్త్ లో సీనియర్ నటి అన్నపూర్ణ స్కిట్స్ లో కనిపిస్తూ అలరిస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదట్లో జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ లో కనిపించిన ఈవిడ ఇప్పుడు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ టీమ్ లో ఫుల్ టైం సీనియర్ లేడీ కమెడియన్ గా కంటిన్యూ అవుతున్నారు. ఐతే ఆమె పెర్ఫార్మ్ చేస్తున్న స్కిట్స్ కి మంచి మార్కులే పడుతున్నాయి. కానీ మరో వైపు ఈమె మీద విమర్శలు కూడా వస్తున్నాయి.
ఆమె సీనియారిటీకి కానీ, ఆమె వయసుకు కానీ గౌరవం ఇవ్వకుండా మరీ చీప్ కామెడీ చేస్తూ అవమానిస్తున్నారంటూ ఫాన్స్ మండిపడుతున్నారు. రీసెంట్ గా ఒక స్కిట్ లో ఆటో రాంప్రసాద్ ఆమెను ముసలావిడ అని అనడం ఇక ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ లోని ఒక స్కిట్ లో నాటీ నరేష్ ఆమెను పంచ్ డైలాగ్స్ తో అవమానించడం మనం చూడొచ్చు.
పరదేశి వచ్చి "ఏకుకు మేకవ్వడం అంటే ఏమిటి" అని నరేష్ ని అడిగేసరికి అతను అన్నపూర్ణమ్మని చూపిస్తూ "నువ్వు అడిగినదానికి ఈవిడే ఉదాహరణ..మొదట్లో ఒక ఎపిసోడ్ అని వచ్చింది ఇప్పుడు అన్ని ఎపిసోడ్స్ చేస్తూ వస్తోంది " అని డైలాగ్ వేసేసరికి అన్నపూర్ణమ్మ షాకయ్యింది. జబర్దస్త్ లో చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి కానీ ఇలాంటి చీప్ డైలాగ్స్ వలన ఆమె ఇన్నాళ్ల పరువు పోతోందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.