English | Telugu
బీబీ జోడీలతో అదిరిపోయే డాన్స్ రియాలిటీ షో
Updated : Dec 11, 2022
బిగ్ బాస్ ప్రతీ సీజన్ సరికొత్తగా స్టార్ట్ అవుతూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ టీమ్ సరికొత్త షోని తెర మీదకు తీసుకురాబోతున్నారు. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చాలామంది మంచి డాన్సర్స్ ఉన్నారు. ఇక వాళ్ళ టాలెంట్ ని ఫుల్ గా వాడేసుకుని ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవడానికి సరికొత్తగా 'బీబీ జోడి' పేరుతో అదిరిపోయే డాన్స్ రియాలిటీ షోనిత్వరలో స్టార్ మాలో ప్రసారం చేయడానికి సిద్ధం చేశారు. ఇక ఈ షోకి సంబంధించిన కలర్ ఫుల్ ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్.
"బీబీ కోరిక మేరకు ఇంటి సభ్యులంతా డాన్స్ చేయండి" అని బిగ్ బాస్ వాయిస్ తో ఈ ప్రోమో మొదలయ్యింది. ఇక ఈ షోలో జోడీలుగా ఎవరెవరు ఉన్నారు అంటే.. అర్జున్-వాసంతి, అఖిల్-తేజస్విని, అవినాష్-అరియనా, సూర్య-ఫైమా, మెహబూబ్-అష్షు, రవికృష్ణ-భాను, రోల్ రైడ-స్రవంతి, ఆర్జే చైతు-కాజల్.
ఇటీవలి కాలంలో డాన్స్ షోస్, కామెడీ షోస్ విపరీతంగా పెరిగిపోయాయి. అందులో భాగంగా ఇప్పుడు బీబీ టీమ్ కూడా ఇలా ప్లాన్ చేశారు. లోతుగా ఆలోచిస్తే ఇంకో విషయం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. బీబీ జోడీస్ తో ఈ షో చేస్తూ రాబోయే కొత్త సీజన్ కోసం తమ ఆడియన్స్ ని ఇప్పటినుంచే ప్రిపేర్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఇక ఈ కొత్త షోని రోల్ రైడా రాప్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. హోస్ట్ గా కలర్ ఫుల్ క్యూటీ, నాటీ మాటల స్వీటీ శ్రీముఖి స్టేజి మీద కార్ లోంచి దిగి "డాన్స్ అంటే ఇలా గ్రాండ్ గానే ఉంటుంది" అని షో గురించి చెప్పి పెర్ఫార్మర్స్ తో కలిసి డాన్స్ చేసింది.