English | Telugu
అప్పుడు నేను ప్రెగ్నెంట్.. నా భర్త మరో స్త్రీతో...
Updated : Apr 21, 2021
మలయాళం టీవీ తారలు అంబిలీ దేవి, ఆదిత్యన్ జయన్ 2019లో పెళ్లి చేసుకున్నారు. ఆ టైమ్‌లో వారి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్ మాత్రమే కాదు, మలయాళం ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలోని వివాదాస్పద ఈవెంట్స్‌లో ఒకటి. ఎందుకంటే ఆదిత్యన్‌కు అది నాలుగో పెళ్లి అయితే, అంబిలికి రెండో పెళ్లి. ఆదిత్యన్ తమ వివాహ బంధాన్ని నాశనం చేశాడంటూ అంబిలి మొదటి భర్త ఆరోపించాడు కూడా. ఇప్పుడు పెళ్లయిన రెండేళ్లకు అంబిలి, ఆదిత్య సంసారం సజావుగా సాగడం లేదనీ, విడాకుల వైపు దారితీసిందనీ వినిపిస్తోంది. దీని గురించి అంబిలీ దేవిని ఆమె ఫ్యాన్స్ ఫేస్‌బుక్ ద్వారా ప్రశ్నించారు.
దీంతో ఆదిత్యన్‌తో తన వైవాహిక బంధంపై నోరు విప్పింది అంబిలి. చట్టపరంగా తానింకా ఆదిత్యన్ భార్యనేనని స్పష్టం చేసింది. మలయాళ మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "ఆదిత్యన్, నేను చాలా ఇబ్బందులు పడి పెళ్లి చేసుకున్నాం. చాలా హ్యాపీగా రోజులు గడుపుతూ వచ్చాం. నిజం చెప్పాలంటే, నేను ప్రెగ్నెంట్ అయ్యేదాకా చాలా సంతోషంగా గడిపాం. అయితే నేను ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లో అతను ఓ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పదమూడేళ్ల కొడుకు ఉన్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెగ్నెంట్ అవడంతో నేను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఆ సమయంలో చాలామంది వెల్‌విషర్స్ నాకు ఫోన్ చేసి ఆదిత్యన్ వ్యవహారం తెలియజేసి, ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యిందని కూడా చెప్పారు. మొదట నేను నమ్మలేదు. నా భర్తను నేను నమ్మాను. కానీ తర్వాత ఆదిత్యన్ ఫేస్‌బుక్ అకౌంట్ చేస్తే, వాళ్లు చెప్పింది నిజమని అర్థమైంది." అని చెప్పుకొచ్చింది అంబిలి.
మరోవైపు అంబిలి ఇప్పటికీ తన భార్యేనని ఆదిత్యన్ తెలిపాడు. రూమర్లకు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. తాను చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాననీ, తీర్చాల్సిన అప్పులు చాలా ఉన్నాయనీ అన్నాడు.
అంబిలి ఇదివరకు లోవెల్ అనే కెమెరామన్‌ను పెళ్లాడింది. వారికి 2013లో అమర్‌నాథ్ అనే కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆదిత్యన్ జయన్ ద్వారా రెండో కొడుక్కి జన్మనిచ్చింది అంబిలి.