English | Telugu

సుమన్ భార్యది ఇండస్ట్రీలో చాలా పెద్ద కుటుంబం

టాలీవుడ్ లో 1980 ల కాలంలో ఒక వెలుగు వెలిగిన నటుడు సుమన్. అప్పటికి ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ హవా కొనసాగుతోంది. ఆ టైంలో వీళ్ళందరికీ గట్టి పోటీనిచ్చాడు సుమన్. అలాంటి సుమన్ భార్య ఎవరో తెలుసా.. ఇండస్ట్రీలో ఆమెది ఎంత పెద్ద కుటుంబమో తెలుసా ? "అసలు మీ మాతృ బాషా తుళు కదా..మరి ఈ సంబంధం మీకు ఎలా వచ్చింది" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సుమన్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు " నేను పుట్టిపెరిగింది అంతా చెన్నైలోనే. అమ్మ కాలేజీలో ప్రిన్సిపాల్, నాన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్. రైటర్ నరసరాజు కూతురు కవిత నాతో మూవీ తీయడానికి డేట్స్ కోసం వస్తున్నారని మా అమ్మ చెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ళ ఇల్లు. అలా అప్పటికి డైరెక్టర్ డేట్స్ అంటూ నా డేట్స్ అంటూ ఒక ఏడాది గడిచిపోయింది.

ఈ ప్రాజెక్ట్ ఇలా కంటిన్యూ అవుతోంది..మరో వైపు కవిత గారి అమ్మాయి శిరీషతో పెళ్లి ప్రొపోజల్ ని వాళ్ళు తీసుకొచ్చారు. నాతో సినిమా అన్నారు కానీ ఫైనల్ గా మా పెళ్లే సినిమాలా ఐపోయింది. మొదట్లో పెళ్లి ఆలోచన లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి నరసరాజు గారి సలహాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్స్ రామారావు గారికి, కృష్ణ గారికి, నాగేశ్వరావు గారికి, కృష్ణంరాజు గారికి ఆయన స్టోరీస్ ఇచ్చారు. రామారావు గారితో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. క్లైమాక్స్ బాగున్నప్పుడు మూవీ హిట్ అవుతుందంటూ ఎన్నో టిప్స్ ఇచ్చేవారాయన. 1994 లో అలా శిరీషను పెళ్లి చేసుకున్నా..అప్పటికి బావబామ్మరిది సినిమా అవుతోంది. ఆ సమయంలో నాకు చాలా ప్రొపోజల్స్ కూడా వచ్చాయి.

పెళ్లి తర్వాత ఈ మూవీకి ఉత్తమ నటుడు అవార్డు కూడా తెచ్చిపెట్టింది. శిరీష సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాబట్టే మా డేట్స్, అవుట్ డోర్ షూటింగ్స్ వంటి వాటి గురించి బాగా తెలుసు. కాబట్టి అడ్జస్ట్ అయ్యేది. ఆర్టిస్ట్ ని అర్ధం చేసుకోవాలంటే సినిమావాళ్లయితేనే అర్ధం చేసుకుంటారు. బయట వాళ్లకు ఇవేమి తెలియవు కదా. డేట్స్, టైమింగ్స్, ఫిక్స్డ్ టైంలో షూటింగ్స్ ఉండవు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను షూటింగ్స్ లో ఉన్నప్పుడు అనవసరంగా నాకు ఫోన్స్ అవీ చేసి విసిగించదు శిరీష. ఫామిలీ లైఫ్ కరెక్ట్ గా ఉండాలి అంటే డబ్బు కన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఉంటే చాలు. " అని చెప్పారు సుమన్.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...