English | Telugu

సుధీర్ వస్తే ఆ మాత్రం ఉంటుందమ్మా !

సుడిగాలి సుధీర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో కూడా నటిస్తూ తన మార్క్ ని క్రియేట్ చేసుకుని వెలుగులోకి వచ్చిన వ్యక్తి. మెజీషియన్ నుంచి కమెడియన్ గా తర్వాత టీం లీడర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రోగ్రాం హోస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్ మూవీలో మెయిన్ లీడ్ గా చేశాడు. కె.రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన తీసిన మూవీ ఇది. ఈ మూవీలో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వాళ్ళు ప్రధాన పాత్రలు పోషించారు.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ఎంతో అందరికి తెలిసొచ్చింది.

ఈ మూవీ గురించి కే.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడిన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇచ్చేసరికి ఆడియన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. అరుపులతో, వీలలతో స్టేజిని మోత మోగించేసరికి ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్‌ అయ్యారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన మూవీలోని నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు సుధీర్‌.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.