English | Telugu

లాస్య సీమంతం వేడుకలు.. హాజరైన అభిజిత్ వాళ్ళ అమ్మ

లాస్య మంజునాథ్ అంటే బుల్లితెర మీద తెలియని వారు లేరు. ఎందుకంటే ఒకప్పుడు లాస్య-రవి జోడీగా "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రాం చేసి బెస్ట్ యాంకర్స్ గా ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతే కాదు లాస్య అంటే చీమ-ఏనుగు జోక్స్ నే ప్రస్తావిస్తారు చాలా మంది. ఆ జోక్స్ తో ఆమె చాలా పాపులర్ అయ్యింది. అలాంటి లాస్య తర్వాత కొంత కాలం బుల్లితెరకు దూరమయ్యింది. ఆ తర్వాత మంజునాథ్ ని వివాహం చేసుకుని స్క్రీన్ మీదకు మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తన భర్తతో పాటు అన్ని రకాల షోస్ లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కూడా. ఆల్రెడీ లాస్యకి దక్ష అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటుంది. తనకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఆమె సెకండ్ పెగ్నన్సీని ఎంజాయ్ చేస్తోంది. న్యూ ఇయర్ లో మరో బేబీకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా తన బేబీ బంప్ తో భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులతో ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ 2023లో వాళ్ళ లైఫ్ లో మరో బిడ్డ రాబోతోంది అని ఈ జంట చెప్పారు. రీసెంట్ గా ఈమెకు సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో లాస్య చూడముచ్చటగా కనిపించింది. ఈ వేడుకకు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎంట్రీ ఇచ్చింది.. అక్కడి వేడుకను వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నాకు ఎంతో ఇష్టమైన మనిషికి సీమంతం.. యు ఆర్ ది బెస్ట్ అక్క " అనే అర్థంలో ఒక కాప్షన్ పెట్టింది.

లాస్య యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.తర్వాత బిగ్ బాస్ సీజన్ - 4 లో పార్టిసిపేట్ చేసాక ఆమె ఫుల్ పాపులర్ అయ్యింది. ఇక ఈ సీమంతం వేడుకకు అభిజిత్ వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. గీతూకి ఆమె అంటే చాలా ఇష్టం అట.. ఆమెతో కలిసి వీడియో తీసి దాన్ని తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. "నాలో నీకు ఏం నచ్చిందో తెలీదు కానీ నాకు మాత్రం నీ బిగ్ బాస్ రివ్యూస్ అంటే బాగా ఇష్టం" అని చెప్పారు అభి వాళ్ళ మదర్... ఇలా గీతూ ఆ వేడుకను ఫుల్ ఎంజాయ్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.