English | Telugu

పాత పాటలు పాడుతూ నెటిజన్లపై ఆరోహీ రావు దాడి!

ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటల హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా పాత పాటలకి ఫోటోలతో ,వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. కాగా ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పాత పాటలు పాడుకుందామా అంటూ ఆస్క్ మి‌ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో ఒక్కో అభిమాని ఒక్కోలా స్పందించగా వాటికి ఆమె తన గొంతుతో పాటలు పాడి వినోదాన్ని పంచింది.

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు. ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువ రోజులు ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపి ఎలిమినేషన్ అయిన ఆరోహీ.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. కీర్తిభట్ పెళ్ళికి అందరు కలిసి వెళ్ళి అక్కడ సరదాగా గడిపారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటలు పాడుకుందామని స్టార్ట్ చేసింది.. నీ ఫేవరేట్ సాంగ్ ఏంటి అని ఒకరు అడుగగా.. ఓ నా రాజా అంటూ పాడింది ఆరోహి. ఆ తర్వాత వసంతం సినిమాలోని గాలి చిరుగాలి పాట పాడమని ఒకరు అడుగగా తను పాడి వినిపించింది. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అంటూ ఆరోహీ పాడింది.'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదో' నుండి మొదలుపెట్టి వరుసగా పాత పాటలు పాడుతూ తన అభిమానులకి వినోదాన్ని పంచింది ఆరోహీ రావు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.