English | Telugu

'నీలాంటి లెక్చరర్ ఉంటేనా మాములుగా ఉండేది కాదు'!


"గుప్పెడంత మనసు" స్టార్ మాలో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. రిషి సర్, వసుధారా బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ రొమాంటిక్ జోడి స్టార్ మా చేసే ఈవెంట్లు, స్పెషల్ షోల్లో కనిపిస్తున్నారు.

ఇక ఇప్పుడు " ఆదివారం విత్ స్టార్ మా పరివారం" అనే పేరుతో ఒక షోని తీసుకొచ్చింది. ఇందులో శ్రీముఖి, అవినాష్, ఎక్స్ ప్రెస్ హరి వచ్చి నవ్విస్తూ ఉంటారు. ప్రతీవారం కొన్ని సీరియల్ జంటలు ఈ షోలో ఎంటర్టైన్ చేసి వెళ్తుంటాయి . అయితే ఈ వారం మాత్రం గుప్పెడంత మనసు సందడి చేసింది. జగతి, మహేంద్ర, దేవయాని, రిషి,వసు ఇలా అందరూ వచ్చారు.

ఇక ఈ ఈవెంట్లో రిషి వసు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సందడి చేశారు. పుష్పరాజ్‌గా రిషి , శ్రీవల్లిగా వసు డాన్స్ చేశారు. ఇక శ్రీముఖి రిషి మీద ఒక పంచ్ వేసింది. " మీలాంటి లెక్చరర్ మా కాలేజీలో ఉంటేనా అంటూ తన చున్నీని తానే చింపేసుకునేంత రెచ్చిపోయింది." "ఈ షోకి యాంకర్ శ్రీముఖి ఐతే ఎలా రావాలి ఒక రేంజ్ లో రావాలి అందుకే ఇంత మేకప్ చేసుకుని వచ్చా" అని రిషి కౌంటర్ వేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.