English | Telugu
ఇదీ వాసంతి కృష్ణన్ రెమ్యూనరేషన్!
Updated : Oct 17, 2022
బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ గా కనిపించేదెవరు?.. అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు వాసంతి. ఈమె తిరుపతిలో జన్మించింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అందుకే ఆమె పేరు చివరన తన తండ్రి పేరుతో కలిపి 'వాసంతి కృష్ణన్' అని యాడ్ చేసుకుంది. ఈమె బెంగుళూరులో ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసి, మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తర్వాత సీరియల్స్ లో యాక్ట్ చేస్తోంది. అంతటితో సరిపెట్టక కన్నడలో నాలుగు సినిమాలు కూడా చేసింది. అయితే అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
2019లో ఆమెకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో 'సిరిసిరి మువ్వలు', 'గోరింటాకు', 'గుప్పెడంత మనసు' సీరియల్స్‌లో నటించింది. ఈమె యాక్టర్ కాకపోయుంటే పైలట్ అయ్యేదట. ఈ విధంగా తన కెరియన్ ని స్టార్ట్ చేయగా తన ప్రతిభతో, ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఈమె హౌస్ లో పెర్ఫార్మన్స్ కంటే గ్లామర్ రోల్ ప్లే చెయ్యడంపై ఎక్కువ శ్రద్ద చూపిస్తోంది. అయితే హౌస్ లోమాత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చెయ్యట్లేదు.
మొన్న నాగార్జున కూడా "గ్లామర్ మీద కాకుండా ఆటలో కూడా ఏకాగ్రతను చూపు" అని చెప్పడం గమనార్హం. చాలా సార్లు వేస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య హౌస్ లో ఎవరితో కూడా గొడవ లేకుండా, అందరితో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఒక అర్జున్ తో మాత్రం కాస్త ఎక్కువ చనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ కి కూడా అర్జున్, వాసంతి మధ్య ఏదో జరుగుతుంది అనే అనుమానం లేకపోలేదు.
ఆ తర్వాత వీకెండ్ లో రోహిత్ కోసం ఒకరు త్యాగం చెయ్యాలి అని నాగార్జున అంటే తను ఒప్పుకొని తన జుట్టుని భుజాల వరకు కత్తిరించుకుంది. ఈవిధంగా చేయడం వల్ల హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా మెచ్చుకున్నారు. అయితే హౌస్ లో జరిగే గేమ్ లో ఆమె పర్ఫామెన్స్, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది.
వాసంతి రెమ్యూనరేషన్ రోజుకి ఇరవై అయిదు వేల నుండి ముప్పై వేల వరకు ఉంటుందని బయట తెలుస్తోంది. హౌస్ లో జరిగే టాస్క్ లలో యాక్టివ్ గా ఉంటూ, ఎంటర్టైన్మెంట్ ఇస్తే విజేతగా నిలుస్తుందని అని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి మున్ముందు ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.