English | Telugu
ఆడాళ్ళు మీకు జోహార్లు అంటున్న మోనిత
Updated : Mar 10, 2023
రీసెంట్ గా జరిగిన ఉమెన్స్ డే వేడుకలు బయట ఎలా జరిగాయో తెలీదు కానీ సోషల్ మీడియా మాత్రం హోరెత్తిపోయింది. అందులోనూ హోలీ కూడా వచ్చేసరికి చాలా మంది లేడీస్ రంగులు పూసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఐతే కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి మాత్రం ఉమెన్స్ డేని వేరుగా సెలెబ్రేట్ చేసుకుంది. మోనితలా రెడీ అయ్యి కొన్ని చీరలు కొనుక్కుని కార్ లో బయల్దేరింది. మధ్యలో ఒక కొబ్బరి బొండాలు అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్లి కొబ్బరిబోండాం కొనుక్కుని తాగింది. బొండాలు అమ్మిన ఆవిడ మోనితను చూసి గుర్తు పట్టింది కానీ మోనిత మాత్రం టీవీలో కనిపించేది నేను కాదు మా సిస్టర్ అని చెప్పి తప్పించుకుంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఈ చీర..అంటూ ఒక ప్యాకెట్ ని ఆమె చేతిలో పెట్టింది. ఒక కొబ్బరి బోండాన్ని మోనిత కొట్టింది. మహిళలు అంటే ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పింది.
అలాగే కుండలు అమ్ముకునే బామ్మ దగ్గరకు వెళ్లి ఆమె చేతికి ఒక చీర ఇచ్చింది. తర్వాత చెరకు రసం అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్ళింది. చెరకు మెషీన్ లో చెరకు పెట్టి రసం తీసింది. ఆ తర్వాత చెరకు రసం అమ్మే ఆవిడ చేతిలో చీర పెట్టి విషెస్ చెప్పింది. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించిన ఒక స్కూల్ ఆయమ్మలుగా పని చేసే ముగ్గురు ఆడావాళ్లను పిలిచి విషెస్ చెప్పి చీరలు ఇచ్చింది. కాసేపు ఆ ముగ్గురు లేడీస్ కి మోనితకు మధ్య ఆడవాళ్లు గొప్పా - మగవాళ్ళు గొప్ప అనే విషయం మీద చిన్న డిబేట్ కూడా జరిగింది. తర్వాత హౌస్ కీపింగ్ చేసే ముగ్గురు యువతులకు కూడా చీరలు ఇచ్చింది. పెట్రోల్ బంక్ లో పని చేసే అమ్మాయికి కూడా చీర ఇచ్చింది. ఆమెకు ఆడపిల్లలు పుట్టారని తన భర్త వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడని, కానీ ఆమె మాత్రం పెట్రోల్ బంక్ లో పని చేస్తూ కూతుళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేసిందని ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పింది మోనిత. ఇలా చాలా మంది లేడీస్ ని కలిసి వాళ్ళ కష్టాలు విని ఆడవాళ్లు ఎక్కడా తగ్గరు అని ప్రూవ్ చేసి చూపింది. యూట్యూబ్ లో తన ఛానల్ లో పెట్టిన ఈ వీడియో వైరల్ గా మారింది.