English | Telugu
ఐ నీడ్ న్యూ హేటర్స్.. ది ఓల్డ్ వన్ ఈజ్ మై ఫ్యాన్!
Updated : Jan 5, 2024
సినిమా ఛాన్స్ ల కోసం కొందరు చిన్న సెలబ్రిటీలు ఏం అయినా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు.. ఎంత దూరమైన వెళ్తారు. ఇంతకి ఎవరా సెలబ్రిటీ.. ఏంటా తెగింపు అనే కదా డౌట్?.. తనెవరంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తళుక్కుమన్న బ్యూటీ ఇనయా సుల్తానా ఆ సెలబ్రిటీ. సీజన్ సిక్స్ తర్వాత తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్ ఫోటోలతో ఎప్పుడు కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది ఈ భామ.
ఇనయా సుల్తానా తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో అందాలని ఆరబోసింది. మాములుగానే ఇమ్ స్టాగ్రామ్ లో ఇలా అందాలు ఆరబోసేవారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆ జాబితాలో కిరణ్ రాథోడ్, అషు రెడ్డి, తేజస్విని, ప్రియాంక సింగ్, అరియాన, ఇనయా, సిరి హనుమంత్ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇనయా చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. అర్థనగ్న ప్రదర్శనలో డోస్ ని పెంచిన ఇనయాకి రోజు రోజుకి మరింతగా ఎక్స్ పోజ్ అవుతుంది. బిగ్ బాస్ కి వెళ్ళే కంటే ముందు ఆర్జీవితో కలిసి ఇనయా ఓ పబ్ లో డ్యాన్స్ చేసింది. అది కాస్త వైరల్ అవ్వడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మొదట తనని అందరు ఎక్కువ టార్గెట్ చేయడంతో బయట ఇనయాకి సింపతీ పెరిగింది. అలాగే హౌస్ లో మెల్లి మెల్లిగా అందరితో ధైర్యం మాట్లాడుతూ ఆటల్లో టాస్క్ లలో తన సత్తా చాటుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక సీజన్ సిక్స్ లో టికెట్ టు ఫినాలేలో రేవంత్, శ్రీహాన్ ఇద్దరు కలిసి ఇనయాని టార్గెట్ చేసి ఆడినా తనొక్కతే ఎదురునిలబడి ఫైట్ చేయడంతో బయట ఆడియన్స్ అంతా తన గేమ్ స్పిరిట్ కి ఫిధా అయ్యారు. ఇక తనకి ఓట్ల శాతం భారీగా పెరిగింది. ఎంతలా అంటే సీజన్ సిక్స్ మొదటి వారం నుండి రేవంత్ నామినేషన్ లో ఉంటే అతనే టాప్ లో ఉండేవాడు. ఓ గేమ్ తర్వాత ఇనయా టాప్ కి వచ్చేసింది. అలా ఇనయా ఫ్యాన్ బేస్ పెంచుకొని బయటకొచ్చేసింది. బయటకొచ్చాక ఫోటోషూట్స్, టూర్స్ అంటు తిరిగేస్తుంది. ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ని పెట్టిన ఇనయా అందులో తన వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ' ఐ నీడ్ న్యూ హేటర్స్.. ది ఓల్డ్ వన్ ఈజ్ మై ఫ్యాన్ 'అంటూ క్యాప్షన్ రాసి ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో చేసిన ఈ అందాల ఆరబోతతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ భామ.