English | Telugu

Vishnupriya Remuneration: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ రెమ్యునరేషన్ ఎంతంటే!


బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ సండే రోజు ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి పన్నెండవ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ.. హౌస్ లో ఒక్క టాస్క్ కూడా సరిగ్గా ఆడింది లేదు. గెలిచింది లేదు. ఎంతసేపు పృథ్వీతో కలిసి తిరగడమే సరిపోయింది‌

ఇక ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ రన్నరప్ అని, తను విన్నర్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిన విష్ణుప్రియ.. బజ్ ఇంటర్వ్యూలో కూడా పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి నోరు విప్పింది. హౌస్‌లో 3 నెలలకు పైగా ఉన్న విష్ణుప్రియ.. ఇందుకు గానూ రోజుకి రూ. 57,142, వారానికి 4 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది‌. అలా 99 రోజులకు గానూ విష్ణుప్రియ సుమారు 57 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే విష్ణుప్రియ అందుకుందని చెప్పవచ్చు. సాధారణంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ లభించింది. ఒక్క సీజన్‌లో మాత్రమే ప్రస్తుతం రూ. 54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. దీనిని బట్టి చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే అధికంగా ఉందని తెలుస్తోంది.

పద్నాలుగు వారాలు పృథ్వీతో కలసి టైమ్ పాస్ చేసిన విష్ణుప్రియ.. నిన్నటి సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయినందుకు ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్-8 కి పట్టిన దరిద్రం పోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.